పారా లీగల్ వాలంటీర్ల ద్వారా తమ అర్జీలను అందించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె.ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. ఖైదీలకు కల్పిస్తున్న ఆహార మరియు ప్రమాణాలు ఇతర సదుపాయాలను పరిశీలించారు. కారాగారంలోని ఖైదీలతో మాట్లాడారు. వారి తరపున ఉచితంగా వాదించేందుకు న్యాయవాదులు కావాలన్నా, ‘బెయిల్ పిటీషన్లు, పై కోర్టుల్లో అప్పీలు వెయ్యాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకరిస్తుందని తెలిపారు. ఇందుకోసం సంస్థ నియమించిన పారా లీగల్ వాలంటీర్ల ద్వారా తమ అర్జీలను అందించాలని అన్నారు. ముద్దాయిలు, ఖైదీల గురించి పనిచేస్తున్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించు కోవాలని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *