బాల కార్మికుల ను గుర్తించేందుకు పోలీసుల సహకారం

-బాల కార్మికుల సమాచారం 94925 55064  , 949255 55065 ,  94925 55066 ,  94925 55067 నంబర్ల కి ఇవ్వండి
-కమిటి సభ్యులు సమక్షంలో గోడ ప్రతులను ఆవిష్కరణ
-గుర్తించిన బాల కార్మికులకు వైద్య పరీక్షలు ఏర్పాటు
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బాల కార్మిక వ్యవస్థ లేకుండా చూడాలని, అందుకోసం క్షేత్ర స్థాయిలో దుర్బలమైన ప్రాంతాల పై మరింతగా అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్, టాస్క్ ఫోర్స్ కమిటి చైర్మన్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలక్టర్ ఛాంబర్ లో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కొరకు జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటి చైర్మన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఆర్థిక, సామాజిక నేపథ్యం కారణంగా సమాజంలో నేడు బాల కార్మిక వ్యవస్థ అంతర్లీనంగా ఉందని, బాల కార్మికులు లేకుండా చూడడంలో మరింత జాగృతితో కమిటి సభ్యులు పనితీరు చూపాల్సి ఉందన్నారు. ప్రజలను ఆమేరకు చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమాజంలో ఎంత జాగృతి తో కూడిన కార్యక్రమాలు నిర్వహించినా ఇంకా బాల కార్మిక వ్యవస్థ ఉందన్నారు. ప్రధాన కూడళ్ళలో బిక్షటన, చేపల చెరువులు, హోటల్స్, జాతీయ రహదారి లోని డాబాలు, కంపెనీల్లో, మెకానిక్ షెడ్స్, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో బాల కార్మికులు పని చేస్తున్నట్లు అనేక సందర్భాల్లో గమనించడం జరిగిందన్నారు. అటువంటి చోట్ల బాల కార్మికులు పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పలు సందర్భాల్లో గుర్తించిన దుర్బలమైన ప్రాంతాల్లో సి సి కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని సంబంధిత యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి, తగిన విజిలెన్స్ చేపట్టాల్సి ఉందన్నారు. బాల కార్మికులును గుర్తించిన సమయంలొ ఆయా రోజుల్లో కమిటీ సభ్యులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక పై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. పిల్లల రక్షణ కమిటీ అధ్వర్యంలో వైద్య అధికారుల సమక్షంలో వైద్య పరీక్షలు చేయించాలని పేర్కొన్నారు. ఇప్పటికే పోలీసుల ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లు ఇతర ప్రధాన ప్రాంతాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసి భధ్రత కోసం నిఘా పెట్టడం జరిగిందని, అటువంటి సందర్భాల్లో బాల కార్మికులు ఉండడం తమ దృష్టికి రావడం జరిగిందన్నారు. వాటి వివరాలు పోలీసులు అందచేస్తారని, ఆయా ప్రాంతాలలో ప్రత్యేక తనిఖీలు తరచుగా నిర్వహించాల్సి ఉంటుందన్నారు. విజిలెన్స్ సాధారణ తనిఖీలా కాకుండా ఫలవంతంగా ఉండాలనీ కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు.

14 ఏళ్లు వయస్సు నిండని బాల కార్మికులు వివిధ పని చేస్తున్నట్లు గానీ భిక్షాటన చేస్తునట్లు గానీ ప్రజల దృష్టికి వొస్తే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకుని రావాల్సి ఉందనీ జిల్లా కార్మిక శాఖ సహాయ లేబర్ కమిషనర్ బి ఎస్ ఎమ్ వలి తెలిపారు. ఇందుకోసం 94925 55064 , 949255 55065 , 94925 55066 , 94925 55067 నంబర్ల కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యత పాటించడం జరుగుతుందని తెలియ చేశారు.

సమన్వయ కర్త, సహాయ కార్మిక  కమిషనర్ బి.ఎస్.ఎం.వల్లి, శిశు సంక్షేమ కమిటీ చైర్మన్ పి. సూర్య ప్రభావతు, RMC డిప్యూటీ కమిషనర్ S.V.రమణ, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ డా జె..సంధ్య, ఎస్‌ఎస్‌ఎ అధికారి డి.ఎస్తేర్ రాణి, జిల్లా ప్రొబేషనరీ అధికారి జె.ప్రసాద్, డిఎల్‌ఎస్‌ఎ ప్రతినిధి బి.వీర్రాజు, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, కుం.జి.స్వాతి. , ఎస్ ఐ ఎల్.కనక రాజు, సహాయ కార్మిక అధికారులు ఇతర కమిటి సభ్యులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *