Breaking News

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కె.యస్.ఆర్.పి జడ్.పి స్కూలు విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ డిస్ట్రిక్ట్ 3020 ఆద్వర్యంలో పటమట లంక నందు గల కె.యస్.ఆర్.పి జడ్.పి స్కూలు నందు ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు చేయడం జరిగింది.

ఈ సందర్బంగా డాక్టర్ వి.శ్రీదేవి ప్రసాద్, అధ్యక్ష్యులు, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మాట్లాడుతూ “దృశ్యం ఐ కేర్ ప్రాజెక్ట్” ద్వారా ఈ కార్యక్రమాన్ని రూపొందించారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం 26 ప్రారంబించామని, ఇప్పటి వరకు ఎ.పి.యన్.ఆర్.యమ్, వి.యమ్.ఆర్.సి, యన్.వి.ఆర్. యమ్.సి, కె.యస్.ఆర్. జడ్.పి. వి.యమ్.సి బ్యాయ్స్ పాఠశాల నందు విధ్యార్థులకు కంటి పరీక్షలను చేసామని, ఇప్పటివరకు 1476 మందిని పరీక్షించగా అందులో 386 విద్యార్థులకు కళ్లజోడు అవసరం అయ్యాయని ప్రతిఒక్కరికి వాటిని ఉచితంగా అందజేస్తామని ఆమె అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి మ్యాక్సివిజన్ ఆసుపత్రి వారు తమ సహకారాన్ని అందిస్తున్నారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలను ఆమె తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జి. రశ్మి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ, ప్రధాన ఉపాధ్యాయులు మురళికృష్ణ, ఉపాధ్యాయులు, విధ్యార్ధులు, మ్యాక్స్ విజన్ ఆసుపత్రి సిబ్బంది మునశ్వర్, పాషా, రవి రాజ్, రాజేశ్వరి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *