-సీజ్ చేసిన రూ.1,29,000 ఖరీదైన పిడిఎస్ బియ్యం
-లంక వెంకటకృష్ణ పై ” 6 ఏ ” కేసు నమోదు
-డి ఎస్ వో ప్రసాద్
నల్లజెర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేసే బియ్యాన్ని దారి మళ్లిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాల అధికారి జె వి ఎస్ ప్రసాద్ హెచ్చరించారు. సోమవారం పౌర సరఫరాల అధికారులు ఏ ఎస్ వో ఎమ్. నాగంజనేయులు అధ్వర్యంలో నల్లజర్ల గ్రామంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఎస్ వో ప్రసాద్ వివరాలు తెలియచేస్తూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పిడిఎస్ బియ్యం అక్రమ నిలవ, తరలింపు చేసే వారిపై దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో నల్లజర్ల రైస్ మిల్లు పై దాడులు నిర్వహించగా శ్రీ రామచంద్ర రవమిల్లు పక్కన గల షెడ్డులో లక్షా ఇరవై తొమ్మిది వేల రూపాయల ఖరీదైన తే 2.850 మెట్రిక్ టన్నుల పిడిఎస్ రైస్ పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ మేరకు లంక వెంకటకృష్ణ పై 6A కేసు నమోదు చేయడం జరిగిందనీ ప్రసాద్ తెలియ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేస్తున్న పీ డి ఎస్ బియ్యాన్ని అక్రమ మార్గాల్లో తరలించడం, నిలవ ఉంచడం చట్ట ప్రకారం నేరంగా పరిగణించడం జరుగుతుందనీ పేర్కొన్నారు.
ఎక్కడైనా అక్రమంగా పిడిఎస్ బియ్యం సంబంధించి సమాచారం ఉంటే సంబంధిత మండల కేంద్రము ఫిర్యాదు చెయ్యాలని, అటువంటి వారి సమాచారం గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఏ ఎస్ వో ఎమ్. నాగంజనేయులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News