రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు స్పెషల్ సమ్మరీ డివిజన్లో భాగంగా ఓటర్ నమోదు నిమిత్తము ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు.
శనివారం సాయంత్రం స్థానిక తొర్రేడు మండల ప్రజా పరిషత్ హై స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని లక్ష్యంతో ప్రత్యేక సమ్మరీ రివిజన్ చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా 18 ఏళ్ల ప్రతి ఒక్కరు ఓటుకు కోసం తమ పేరు నమోదు చేసుకోవాలని సంబంధిత ఓటర్ నమోదు కేంద్రాల్లో ఫారం సిక్స్ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. కొత్తగా ఓటర్ నమోదు తో పాటు , చిరునామా మార్పు పేరులో తప్పులు మార్పులు చేర్పులు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. ఇందుకోసం నిర్ణీత ఫారం లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుందని తెలిపారు. 18 ఏళ్ల నిండిన యువ వాటర్ లకు ఇది ఏడాది నాలుగు సార్లు ఫోటోకు నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రశాంతి తెలిపారు. బీరువా రిజిస్టర్ పరిశీలించడం జరిగింది. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆర్ డి ఓ ఆర్ .కృష్ణ నాయక్ లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News