Breaking News

Andhra Pradesh

వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలి

-ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి -వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు ఆదేశాలు జారీ చేసిన వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ విపత్తు నిర్వహణ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (NDMEWS) జారీ చేసిన వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో విజయవాడ నగరంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున శనివారం సాయంత్రం 4 గంటలకు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్ని శాఖాధిపతులు, జోనల్ కమిషనర్లు, వార్డు స్థాయి …

Read More »

ఆపరేషన్ క్లీన్ స్వీప్‌లో రెండో వారానికి శ్రీకారం

-కాలువలు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, బ్యాక్ లేన్ల డీ-సిల్టింగ్‌పై ప్రత్యేక దృష్టి -ప్రజల భాగస్వామ్యంతో నగరాన్ని ముంపు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా రెండో వారంలో చేపట్టతున్న స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, ప్రధాన కాలువలు, అంతర్గత డ్రెయిన్లు, బ్యాక్ లేన్ల డీ-సిల్టింగ్ కార్యక్రమాలకు శనివారం ఎన్‌టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం సమీపంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) …

Read More »

శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక మహోత్సవాల్లో పాల్గొన్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లా, కేవిబి పురం మండలం, శ్రీనివాసపురం (మారప్ప రెడ్ది ఖండ్రిగ) గ్రామంలో జరుగుతున్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామివారి వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ తో కలిసి శుక్రవారం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గ్రామ ప్రజలు ఎంపీకి, సమన్వయకర్తకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రత్యేక పూజల్లో పాల్గొని, …

Read More »

ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్

-18 గిగావాట్లను ప్రధాన గ్రిడ్‌కు కనెక్ట్ చేసేలా సుమారు రూ.22 వేలకోట్లతో ప్రతిపాదనలు -ప్రభుత్వ భవనాలపై సోలార్ ఏర్పాటు పనులు త్వరితగతిన చేపట్టాలి -2,898 హాస్టళ్లు, స్కూళ్లలో నెట్ జీరో విధానంలో సొలారైజేషన్ -నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పీఎం సూర్యఘర్ అమలు -విద్యుత్ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి.. ఆ మేరకు విద్యుత్ నెట్ వర్క్‌ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 18 …

Read More »

ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాల పరిమితిని నిర్దేశించండి

-ఆర్టీసీ ఆస్తుల సద్వినియోగంతో సంస్థ బలోపేతానికి ప్రణాళికలు -ఐ అండ్ ఐ, ఆర్టీసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇన్ఫ్రా ప్రాజెక్టుల పూర్తికి కాలపరిమితిని నిర్దేశించుకుని పని చేయాలని స్పష్టం చేశారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పెట్టుబడులు, మౌళిక సదుపాయల కల్పన, ఆర్టీసీపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, ఫిషింగ్ హర్బర్ల నిర్మాణం పురోగతిపై సమావేశంలో …

Read More »

సైబర్ నేరాల అడ్డుకట్టకు “ఎపీ సైబర్ గార్డ్”

-6 పిల్లర్స్ రెస్పాన్స్ టీమ్స్‌తో నేరాలకు అడ్డుకట్ట -ప్రజలను నిత్యం అప్రమత్తం చేయాలి…సైబర్ పెట్రోలింగ్ జరగాలి -సైబర్ మోసాలపై ఫిర్యాదు అందిన మరుక్షణమే వార్ రూంలో జీరో ఎఫ్ఐఆర్ -ఏపీలో సైబర్ నేరానికి పాల్పడితే… తప్పించుకోలేమనే భయం క్రిమినల్స్‌కు కలగాలి -ప్రజలు నష్టపోకుండా బ్యాంకులు సహకరించాలి -సైబర్ నేరాల అడ్డుకట్టకు పోలీసు శాఖ కార్యాచరణపై సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సైబర్ నేరాల అడ్డుకట్టకు జీరో ఎఫ్ఐఆర్ విధానం అమల్లోకి తేవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

అమరావతిలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సంస్థ ఏర్పాటు చేయండి.

-ఫైబర్ ఉత్పత్తి అయ్యే ఉద్యాన పంటలతో రైతులకు అదనపు ఆదాయాలు -ఏపీలో కొబ్బరితో సహా వేర్వేరు పంటల ద్వారా పీచు ఉత్పత్తికి ఆస్కారం -కేంద్ర జౌళి శాఖ మంత్రికి సీఎం ప్రతిపాదనలు -సచివాలయంలో సీఎం చంద్రబాబుతో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ భేటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో వేర్వేరు ఉద్యాన పంటల ద్వారా ఉత్పత్తి అవుతున్న ఫైబర్ కు ప్రోత్సహం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి స్పష్టం చేశారు. ఈ మేరకు సచివాలయంలో శుక్రవారం …

Read More »

ఏపీటీడీసీ పురోభివృద్ధియే లక్ష్యం : చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ

​విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) ప్రగతి, రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా విజయవాడలోని బెరమ్ పార్క్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. APTDC చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంస్థ బలోపేతానికి, పర్యాటకులకు అందించే సేవల నాణ్యతను పెంచడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మెగా సమీక్షలో రాష్ట్రంలోని 7 డివిజన్ల డివిజనల్ మేనేజర్లు, 58 మంది యూనిట్ మేనేజర్లు మరియు ఇంజనీరింగ్ …

Read More »

పారదర్శకమైన ఓటరు జాబితాల నిర్వహణ అత్యంత కీలకం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం ఆదేశాలు మరియు ప్రధాన ఓటరు నమోదు అధికారి, ఆంధ్రప్రదేశ్ వారి మార్గదర్శకాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమానికి సంబంధించి గుర్తింపు పొందిన జాతీయ మరియు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వారి ఆధ్వర్యంలో శుక్రవారం  తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని VC హాల్‌లో సమావేశం నిర్వహించబడింది. ప్రధాన ఓటరు నమోదు అధికారి, ఆంధ్రప్రదేశ్, వెలగపూడి వారి మెమో నెం. …

Read More »

నున్నలో పేద విద్యార్థుల కోసం ఆశాదీపం

-భారీ హాస్టల్ భవన నిర్మాణానికి ముమ్మర సన్నాహాలు -అనుమతుల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేస్తా -ఎంపీ సానా సతీష్ బాబు హామీ -పేద విద్యార్థుల కష్టాలను గమనించాం.. నాణ్యమైన వసతి కల్పనలో వెనక్కి తగ్గేదే లేదు: -మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ -విద్యార్థుల వసతి సమస్యలకు చెక్: రాయల్ సర్వీస్ ట్రస్ట్ సేవలపై వెల్లువెత్తిన ప్రశంసలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల నుంచి విజయవాడ వంటి నగరాలకు ఉన్నత చదువుల కోసం వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థుల వసతి సమస్యలను …

Read More »