Breaking News

Andhra Pradesh

56 మందికి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 56 మందికి ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. శనివారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో 56 మంది లబ్ధిదారులకు రూ 29 లక్షల 70 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రజారోగ్యమే లక్ష్యంగా పశ్చిమలో పెద్ద ఎత్తున ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

-ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే లక్ష్యంగా భవానీపురంలోని ఎన్డీఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ …

Read More »

మహిళా పారిశ్రామికవేత్తలకు మార్కెటింగ్ భరోసా కల్పించాలి..

-రతన్ టాటా హబ్ (ఆర్‌టిహెచ్) ద్వారా శిక్షణ అందిస్తాం.. -ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం సద్వినియోగం చేసుకోవాలి.. -ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంలో భాగస్వాములుకండి.. -జిఎస్‌టి, ఎఫ్ఎస్‌టి రిజిస్ట్రేషన్ తప్పక పాటించాలి.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పొదుపు సంఘాల మహిళలకు పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించి తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన రతన్ టాటా హబ్ (ఆర్‌టిహెచ్) పట్టణ స్వయం సహాయక సంఘం ( …

Read More »

మత్తుతో యువత విలువైన జీవితం చిత్తు కాకూడదు..

-మాదకద్రవ్యల నియంత్రరణపై ప్రత్యేక దృష్టి పెట్టండి.. -విద్యాసంస్థలు, హాట్ స్పాట్‌ల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.. -మాదకద్రవ్య రహిత జిల్లా గా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం.. -మాదక ద్రవ్యల అరికట్టడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి.. -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాదక ద్రవ్యల మత్తుతో యువత విలువైన జీవితం చిత్తు కాకూడదని మాదకద్రవ్యల నియంత్రరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, విద్యాసంస్థలు, హాట్ స్పాట్‌ల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి జిల్లాను మాదకద్రవ్య రహిత జిల్లా గా …

Read More »

ఏ.బి.సి. సెంటర్ నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో నూతనగా నిర్మిస్తున్న రెండవ యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏ.బి.సి) సెంటర్ నిర్మాణ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు ఏ.బి.సి సెంటర్ నిర్మాణం పై అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశం నందు తొలుత ప్రస్తుతం పొన్నూరు రోడ్డులో నిర్వహణలో ఉన్న ఏ.బి.సి సెంటర్ నందు రోజుకు ఎన్ని కుక్కలకు ఏ.బి.సి ఆపరేషన్ …

Read More »

వర్షాకాలంలో గ్రీనరి అభివృద్ధి, ముందస్తు చర్యల పై విభాగాధిపతులతో సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న వర్షాకాలంలో గుంటూరు నగరంలో గ్రీనరి అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శనివారం నగర పాలక సంస్థలోని ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు రానున్న వర్షాకాలంలో గ్రీనరి అభివృద్ధి మరియు తీసుకోవాల్సిన ముందస్తు చర్యల పై వివిధ విభాగాధిపతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రానున్న వర్షాకాలంలో గుంటూరు నగరంలో గ్రీనరీని అభివృద్ధి చేయడానికి పార్కులు మరియు సెంట్రల్ డివైడర్లలో మొక్కలను …

Read More »

గ్రీనరి అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు సిద్దం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్.టి.ఆర్ స్టేడియాన్ని అధునాతన ప్రమాణాలతో, ఆహ్లాదకరంగా ఉండేలా గ్రీనరి అభివృద్ధి చేయుటకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ తెలిపారు. శనివారం నగర పాలక సంస్థలోని కమిషనర్ ఛాంబర్ నందు ఎన్.టి.ఆర్ స్టేడియం పాలకవర్గం మరియు ఆకాష్ ఆర్కిటెక్ ప్రతినిధులతో, జియంసి అధికారులతో ఎన్.టి.ఆర్ స్టేడియం అభివృద్ధి పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశం నందు తొలుత స్టేడియంలో మహిళకు, పురుషులకు వేరుగా వేరుగా జిమ్ లను అభివృద్ధి చేయడానికి ఆకాష్ ఆర్కిటెక్ …

Read More »

“ఆపరేషన్ క్లీన్ స్వీప్” లో నగర ప్రజలు విస్తృతంగా భాగస్వాములు కావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మన నగరం – మన బాధ్యత అనే నినాదంతో “ఆపరేషన్ క్లీన్ స్వీప్” లో నగర ప్రజలు విస్తృతంగా భాగస్వాములు కావాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ‘స్వర్ణాంధ్ర – స్వచ్చాంద్ర’ సాధనలో భాగంగా “ఆపరేషన్ క్లీన్ స్వీప్” రెండో వారం కార్యాచరణ మేరకు ఈనెల 30 నుండి జూన్ 4 వ తేదీ వరకు నగరంలోని అన్ని వార్డ్ ల్లో డ్రైన్ల క్లీనింగ్ కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా స్థానిక …

Read More »

జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా. ఎన్. చి. నరసింహులు పదవీ విరమణ సన్మాన సభ ఘనంగా నిర్వహణ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలోని జెడ్పీ కన్వెన్షన్ హాల్ జిల్లాలో పశుసంవర్ధక శాఖాధికారి డా. ఎన్. చి. నరసింహులు పదవీ విరమణ సన్మాన సభ ఘనంగా నిర్వహించబడింది. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు, సిబ్బంది, పశువైద్యులు మరియు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు ఘన సన్మానం చేశారు. డా. నరసింహులు సుమారు 33 సంవత్సరాలపాటు పశుసంవర్ధక శాఖలో వివిధ హోదాలలో విశిష్ట సేవలందించి, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారిగా పదవీ విరమణ పొందారు. ఆయన సేవలను, క్రమశిక్షణను, అంకితభావాన్ని సభలో పలువురు …

Read More »

కౌశలం పోర్టల్ ద్వారా పరిశ్రమలకు అవసరమైన స్థానిక నైపుణ్య మానవ వనరుల కల్పనకు చర్యలు

-పారిశ్రామికవేత్తలు అందరూ కౌశలం పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి -రాష్ట్రంలో ఎక్కడా జరగని రీతిలో పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి.. సలహాలు, సూచనలు స్వీకరణ -పరిశ్రమల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుంది -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ కానూరు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నైపుణ్య మానవ వనరుల కొరత ఒకటని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కౌశలం పోర్టల్ కార్యక్రమాన్ని పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, …

Read More »