-పందెంలో పాల్గొన్నా చట్టరీత్యా నేరమే -నిబంధనల అమలుకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని… ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చర్యలు తప్పవని ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందాలు జరక్కుండా తీసుకుంటున్న చర్యలపై సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సమన్వయ …
Read More »Daily Archives: January 6, 2025
రేపు మాజీ సైనికుల జెఎసీ ముఖ్యనేతల సమావేశం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని జిల్లాల మాజీ సైనిక సంఘాలతో, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ కమిటీతో, ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో, ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితినీ కలుపుకుని ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ముఖ్య నేతల సమావేశం రేపు జరగబోతుంది. ఈ సందర్భంగా జెఎసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకర్‌రావు, నేషనల్ ఎక్స్ సర్వీస్‌మెన్ కో ఆర్డినేషనల్ కమిటీ (ఎన్‌ఈఎక్స్‌సిసి) జాతీయ …
Read More »క్షేత్ర స్థాయిలో అర్జీలు పరిష్కారం కోసం మండల, డివిజన్ పరిధిలో పిజిఆర్ఎస్ ఏర్పాటు
-తొలిసారిగా నల్లజర్ల మండలం పిజిఆర్ఎస్ కు హజరు కావడం జరిగింది -కలెక్టరు పి ప్రశాంతి నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు పరిష్కారం కోసం మండల కేంద్రంలో ఉన్న అధికారులకి అర్జీలను అందచేయాలని, వాటికీ జవాబుదారీతనం కలిగి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేశారు. సోమవారం స్థానిక నల్లజర్ల ఎంపిడివో కార్యాలయంలో పీజీఆర్ఎస్ కు కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర …
Read More »జనవరి 9 వ తేది మధ్యాహ్నాం 3.00 గంటలకి రాజమండ్రీ ఎంపి అధ్యక్షతన జిల్లా అభివృధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం
-కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా దిశ కమిటీకి దగ్గుబాటి పురందేశ్వరి, పార్లమెంటు సభ్యురాలు, రాజమహేంద్రవరం వారిని అధ్యక్షురాలుగా నియామించుచూ ప్రభుత్వము వారు ఉత్తర్వులు జారీచేసియున్నారని ఈ మేరకు రాజమండ్రీ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన జనవరి 9 వ తేది న సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలియచేసారు. తూర్పు గోదావరి జిల్లాలో వివిధ శాఖల్లో కేంద్ర ప్రభుత్వ పధకములు అమలులో భాగముగా జిల్లా అభివృధి …
Read More »మధ్యవర్తిత్వ తర్పీదు కార్యక్రమం…
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం గౌరవ సుప్రీం కోర్ట్ వారి మధ్యవర్తిత్వం మరియు రాజీ మార్గ పధక సంఘం (M.C.P.C) మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం నందు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత చే 06.01.2025 నుండి 10.01.2025 వరకు అనగా ఐదు రోజుల పాటు 40 గంటల మధ్యవర్తిత్వ తర్పీదు కార్యక్రమం ప్రారంభమైనది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ …
Read More »జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం (NLP) విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి
-20-01-2025 నుండి 02-02-2025 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు -1310 బృందాలతో 6,41,680 గృహాల సందర్శన -జెసి చిన్న రాముడు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లాలో జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం కింద లెప్రసీ వ్యాధికి గురైన వారిని గుర్తించడంలో ప్రచారం (LCDC) ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని, విస్తృత స్థాయిలో చైతన్యం తీసుకుని రావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జాతీయ లెప్రసీ …
Read More »అక్రమ మద్యంపై ఉక్కుపాదం
-ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దావ్ శర్మ మార్గనిర్దేశకత్వంలో విజయవంతంగా అంతర్-రాష్ట్ర రైడ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అక్రమ మద్యం వ్యాపారులకు పెద్ద దెబ్బగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దావ్ శర్మ భారీ అంతర్-రాష్ట్ర రైడ్‌కు మార్గ నిర్దేశం వహించారు. ఫలితంగా పెద్ద మొత్తంలో అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, నాశనం చేశారు. పండుగల సీజన్‌లో ఒడిశా నుండి ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాలకు అక్రమ మద్యం రాకను అరికట్టడానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఎక్సైజ్ శాఖల మధ్య సమన్వయ ప్రయత్నంలో భాగంగా సోమవారం …
Read More »ప్రజారోగ్యం కాపాడే కార్మికులు తమ ఆరోగ్య పరిరక్షణకు కూడా శ్రద్ధ చూపాలి
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారోగ్యం కాపాడే కార్మికులు తమ ఆరోగ్య పరిరక్షణకు కూడా శ్రద్ధ చూపాలని, విధుల్లో తగిన రక్షణ పరికరాలు ధరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ సూచించారు. సోమవారం కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ స్వచ్చాంధ్ర ప్రదేశ్ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టం (నమస్తే)లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజి (యూజిడి) కార్మికులకు పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ (పిపిఈ) కిట్లను కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ …
Read More »స్థానిక సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ కమిషనర్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో స్థానిక సమస్యల పరిష్కారం కోసం నగరపాలక సంస్థలో చేపట్టే డయల్ యువర్ కమిషనర్, పిజిఆర్ఎస్ లో ప్రజలు ఇస్తున్న ఆర్జీలు రీ ఓపెన్ కాకుండా అధికారులు సమగ్రంగా పరిశీలించి, శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. సోమవారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో డయల్ యువర్ కమిషనర్, కౌన్సిల్ హాల్లో పిజిఆర్ఎస్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ …
Read More »రోడ్ విస్తరణ పనులు వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రెడ్డిపాలెం-ఇన్నర్ రింగ్ రోడ్ విస్తరణ పనులు వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు సమన్వయంతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. సోమవారం కమిషనర్ గారు సంజీవయ్య నగర్ రైల్వే గేటు నుండి రెడ్డిపాలెం, ఇన్నర్ రింగ్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్, రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ …
Read More »
Prajavartha Online Telugu News