అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో సీఎం చంద్రబాబును ఉండవల్లి నివాసంలో కలిసి రూ.10,46,169 చెక్కును అందించారు. సీఎంకు చెక్కును అందజేసిన వారిలో అసోసియేషన్ ప్రతినిధులు డి.గోపాలకృష్ణ, వరప్రసాద్, తదితరులు ఉన్నారు. గతేడాది విజయవాడలో వచ్చిన వరదల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు తమవంతుగా విరాళంగా ఇచ్చినట్లు వారు తెలిపారు.
Read More »Daily Archives: January 28, 2025
శంబర పోలమాంబకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : శంబర పోలమాంబకు మంగళవారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యా రాణి పట్టు వస్త్రాలను సమర్పించారు. మంత్రి సంధ్యా రాణి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి నారాయణ రావు, అర్చకులు సంప్రదాయబద్దంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి పట్టువస్త్రాలు అందించి, ఆలయ సంప్రదాయంతో ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనాలు అందించాలని ఆకాక్షించారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే మహత్కర భాగ్యాన్ని కల్పించిన ముఖ్యమంత్రి …
Read More »సోలార్ పవర్ తో కలిగే ప్రయోజనాలు గురించి అవగాహన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పీ ఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం గురించి మంగళవారం సబ్ కలెక్టర్ కావూరి చైతన్య రెవెన్యూ మరియు విద్యుత్తు శాఖల సిబ్బందితో ర్యాలీ నిర్వహించినారు ఈ ర్యాలీలో భాగంగా సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో 33 వ డివిజన్ బి ఆర్ టి ఎస్ ఎన్ఆర్పి రోడ్డు నుండి శివాలయం రోడ్డు మీదగా భగత్ సింగ్ రోడ్డు గవర్నమెంట్ వరకు స్లొగన్స్ చెప్పుకుంటూ బ్యానర్లతో ఫ్లకార్డ్ లతో కరపత్రాలు పంచుతూ పెద్ద ఎత్తున ర్యాలీ …
Read More »ప్రతి ఇల్లు సూర్యఘర్ వెలుగుల హరివిల్లు కావాలి..
-విద్యుత్ చార్జీలు చెల్లింపుల భారం తగ్గించాలన్నదే లక్ష్యం.. -పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి.. -ఎంపి కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు విద్యుత్ బిల్లుల చెల్లింపుల భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఇంటిని సూర్యఘర్ వెలుగులతో నింపి హరివిల్లు చేసుకోవాలని, సోలార్ ప్యానెల్ కనెక్షన్ల కొరకు తక్షణమే పేర్లు నమోదు చేసుకోవాలని ఎంపి కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశలు పిలుపునిచ్చారు. సూర్యఘర్ …
Read More »ఈవీఎం గోదాముకు పటిష్ట భద్రత
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) భద్రతకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. నెలవారీ సాధారణ తనిఖీల్లో భాగంగా గొల్లపూడి మార్కెట్ యార్డులో ఈవీఎంలను భద్రపరిచే గోదామును మంగళవారం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. సీసీ టీవీ కెమెరాలతో గోదాముకు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ …
Read More »కేంద్ర బడ్జెట్ లో ఈసారి ఏపీకి మెరుగైన కేటాయింపులు : ఎంపీ కేశినేని శివనాథ్
-టీడీపీపీ సమావేశంలో పాల్గొన్న ఎంపి కేశినేని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండవల్లిలోని ఆయన నివాసంలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరిగింది. ఈసమావేశంలో ఎంపి కేశినేని శివనాథ్ ఇతర ఎంపిలు,ముఖ్యనేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపి కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహం, నిధుల సాధనకు సంబంధించిన సమన్వయంపై సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేసినట్లు తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్నో నిధులు, …
Read More »నాయీబ్రాహ్మణుల సంక్షేమమే టీడీపీ ధ్యేయం : ఎంపి కేశినేని శివనాథ్
-ఎపి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారమహోత్సవానికి హాజరు -చైర్మన్ రుద్ర కోటి , డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపి కేశినేని శివనాథ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాయీ బ్రాహ్మణుల సంక్షేమమే టీడీపీ ధ్యేయమని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఎపి నాయీ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆ సంస్థ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారమహోత్సవానికి ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ గా …
Read More »ప్రజలకు ప్రభుత్వ పథకాలపై మరింతగా అవగాహన కల్పించాలి : ఎంపి కేశినేని శివనాథ్
-జిల్లా ఐ.టి.డి.పి కార్యవర్గ సభ్యులతో సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ ఆరాచక పాలనపై ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చి, ప్రజా గళం వినిపించటంలో ఐటిడిపి కీలకపాత్ర పోషించింది. అంతకు మించిన బాధ్యతతో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై సోషల్ మీడియా ద్వారా మరింతగా అవగాహన కల్పించాలని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఐ.టి.డి.పి కార్యవర్గ సభ్యులతో గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఎంపి కేశినేని శివనాథ్ సమావేశం నిర్వహించారు. …
Read More »ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతపురం ఎంపి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం ఎంపి అంబికా జి. లక్ష్మీనారాయణగురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపి కేశినేని శివనాథ్ కు ఎంపి లక్ష్మీనారాయణ పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం పార్లమెంట్ లో జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలతో పాటు రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు గుర్రం కొండయ్య, విజయవాడ వాల్మీకి బోయ సంఘం అధ్యక్షుడు వరిగే నరసింహారావులతో …
Read More »ఎన్టీఆర్ జిల్లాలో 2లక్షల ఇళ్లకు సూర్యఘర్ కనెక్షన్స్ అందించటమే ధ్యేయం : ఎంపి కేశినేని శివనాథ్
-సూర్యఘర్ పథకం పై పటమట సెంటర్ లో అవగాహన ర్యాలీ -ర్యాలీ లో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్, కలెక్టర్ లక్ష్మీ శ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, -ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి ఇంట్లో సౌర వెలుగులు నిండాలి -పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే పథకం పీఎం సూర్య ఘర్ -విద్యుత్ చార్జీలు చెల్లింపుల భారం తగ్గించాలన్నదే లక్ష్యం.. -పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు విద్యుత్ బిల్లుల చెల్లింపుల భారం తగ్గించేందుకు అమలు చేస్తున్న …
Read More »
Prajavartha Online Telugu News