-జిల్లా ఐ.టి.డి.పి కార్యవర్గ సభ్యులతో సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వ ఆరాచక పాలనపై ప్రజా సమస్యలు వెలుగులోకి తెచ్చి, ప్రజా గళం వినిపించటంలో ఐటిడిపి కీలకపాత్ర పోషించింది. అంతకు మించిన బాధ్యతతో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై సోషల్ మీడియా ద్వారా మరింతగా అవగాహన కల్పించాలని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
ఎన్టీఆర్ జిల్లా ఐ.టి.డి.పి కార్యవర్గ సభ్యులతో గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఎంపి కేశినేని శివనాథ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఐటిడిపి… అంటే ఒక బాధ్యత, క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. జిల్లా స్థాయిలో ఐటిడిపి కి కావాల్సిన మౌళిక సదుపాయాల గురించి కార్యవర్గ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఐటిడిపికి అండగా వుంటానని, కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తానని తెలిపారు. అధికారంలోకి వచ్చామని విశాంత్రి తీసుకోకుండా మరింత చురుగ్గా పనిచేయాలని, ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమాలు, రాష్ట్రంలో, జిల్లాలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ నియోజవకర్గ ఐ.టి.డి.పి అధ్యక్షుడు చిరుమామిళ్ల కృష్ణ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బోగతా రవితేజ, పార్లమెంట్ నియోజకవర్గ ఐటిడిపి కార్యనిర్వహక కార్యదర్శి నక్కబోయిన దుర్గ జగదీష్, స్టేట్ ఐటిడిపి కార్యదర్శి కొలా దుర్గారావు, తిరువూరు ఐటిడిపి అధ్యక్షుడు ఉప్పెల నరసారెడ్డి, మైలవరం ఐటిడిపి అధ్యక్షుడు పరసా కిరణ్, నందిగామ ఐటిడిపి అధ్యక్షుడు కొమ్మూరి శేషు, విజయవాడ వెస్ట్ ఐటిడిపి అధ్యక్షురాలు మంత్రరత్నం స్రవంతి, విజయవాడ ఈస్ట్ ఐటిడిపి అధ్యక్షురాలు సిద్దెల వివేక్, విజయవాడ సెంట్రల్ ఐటిడిపి అధ్యక్షుడు మంగరాజులతోపాటు ఐటిడిపి మండల, గ్రామ అధ్యక్షులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News