Breaking News

Daily Archives: July 16, 2026

విజయవాడలో “ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం – 2026”

-ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని అద్భుతమైన హస్తకళల సాంప్రదాయాలను ప్రోత్సహించడానికి మరియు హస్తకళాకారులకు మెరుగైన మార్కెట్ అవకాశాలను కల్పించే లక్ష్యంతో విజయవాడలో నాలుగు రోజుల పాటు “ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం – 2026” ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని, పంటకాలువ రోడ్డులో ఉన్న మారిస్ స్టెల్లా …

Read More »

ఈ నెల 17న విజ‌య‌వాడ తూర్పులో ప్రత్యేక గ్రీవెన్స్

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 17వ తేదీ శుక్ర‌వారం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరుగుతుంద‌ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కృష్ణ‌లంక‌లోని అమ‌ర‌జీవి పొట్టి శ్రీరాములు మునిసిప‌ల్ కార్పొరేషన్ హైస్కూల్ వ‌ద్ద ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో విజ‌య‌వాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని స్థానిక ప్ర‌జ‌ల నుంచి అధికారులు అర్జీలను ఉదయం …

Read More »

విద్యా ప్ర‌మాణాల పెంపున‌కు వినూత్న కృషి

– పదో తరగతి విద్యార్థులకు హిందీ స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ – ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రత్యేక అధ్యయన పుస్తకం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పదో తరగతి విద్యార్థులు ప‌రీక్ష‌ల్లో అత్యుత్తమ మార్కులు సాధించేలా వినూత్న కృషితో అధ్య‌య‌న పుస్త‌కాల‌ను రూపొందిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ఈ మెటీరియ‌ల్‌ను స‌ద్వినియోగం చేసుకొని మంచి ఫ‌లితాలు సాధించాల‌ని సూచించారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. విద్యాశాఖ అధికారుల‌తో కలిసి గురువారం క‌లెక్ట‌రేట్‌లో హిందీ స్ట‌డీ మెటీరియ‌ల్‌ను …

Read More »

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన డ్రెయిన్లలో ప్రత్యేక శుభ్రత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాకాలన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధాన డ్రైన్లలో ప్రత్యేక శుభ్రతను చేపడుతున్నామని విజయవాడ నగరపాలక సంస్థ అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ అన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గురువారం ఉదయం నైజాం గేట్, వన్‌టౌన్‌లోని మేజర్ అవుట్‌ఫాల్ డ్రెయిన్‌లో పేరుకుపోయిన వ్యర్థాలను లాంగ్ ఆర్మ్ ఎక్స్‌కవేటర్ సహాయంతో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ పర్యవేక్షణలో పారిశుద్ధ్య సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ మాట్లాడుతూ, …

Read More »

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026 డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం శాకాధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)-2026 కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఇప్పటికే పంపిణీ చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను సకాలంలో డిజిటలైజ్ చేసి, ప్రతిరోజూ నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు, సూపర్వైజర్లు, సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి పెండింగ్ లేకుండా డేటా నమోదు …

Read More »

ఉత్త‌మ ఫొటోగ్రాఫ‌ర్ల‌కు జిల్లాస్థాయి పుర‌స్కారాలు

– మూడు విభాగాల్లో ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ డే పోటీలు – ఎంట్రీలు పంపేందుకు చివ‌రితేదీ ఆగస్టు 5 – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఫ్రేమ్ ఒక జ్ఞాపకం.. కాలం మరచిపోయినా… ఫొటో మాత్రం ఆ క్షణాన్ని సజీవంగా ఉంచుతుంది. మ‌ధుర క్ష‌ణాల‌ను శాశ్వతం చేసే ఫొటోగ్ర‌ఫీలో విశేష ప్ర‌తిభ‌క‌న‌బ‌రిచిన ఫొటోగ్రాఫ‌ర్ల‌కు ఆగస్ట్ 19 న ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వం సంద‌ర్భంగా జిల్లాస్థాయిలో పుర‌స్కారాలు ప్ర‌దానం చేయ‌నున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ తెలిపారు. ప్ర‌పంచ …

Read More »

సోనమ్ వాంగ్ చుక్ దీక్షలకు సిపిఐ మద్దతు

-సోనం వాంగ్ చుక్ కు సంఘీభావంగా పార్టీ శ్రేణులు కార్యక్రమాలు చేపట్టండి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక దీక్ష చేపట్టిన ప్రముఖ పర్యావరణ వేత్త, రామ్ మెగసెసే అవార్డు గ్రహీత సోనం వాంగ్ చుక్ కు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య సంఘీభావం ప్రకటించారు. ఈ మేరకు ఈశ్వరయ్య …

Read More »

జిల్లా పరిషత్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

-జెడ్పీ ఆస్తులను ఆదాయ వనరులుగా అభివృద్ధి చేస్తాం – జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయడంతో పాటు, జెడ్పీ ఆస్తులను ఆదాయ వనరులుగా తీర్చిదిద్దే చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక పేర్కొన్నారు. జిల్లా ప్రజా పరిషత్ 1వ స్థాయి సంఘం (ప్లానింగ్, ఆర్థికం), 7వ స్థాయి సంఘం (పనులు) సమావేశాలు గురువారం మచిలీపట్నంలోని జిల్లా ప్రజా పరిషత్ …

Read More »