Breaking News

Daily Archives: July 16, 2026

రాష్ట్రంలో 12 కొవిడ్‌ కేసులు

-నాలుగు జిల్లాల్లో చెదురుముదురుగా నమోదు -పూణే ల్యాబ్ కు జన్యుక్రమ విశ్లేషణ నిమిత్తం 5 నమూనాలు -జులై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా 339 కోవిడ్ కేసుల నమోదు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు చెదురుము దురుగా బయటపడ్డాయి జూన్‌ 26 నుంచి జులై 16 వరకు మొత్తం 12 మంది కోవిడ్ వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో నలుగురు మృతి చెందారు. వీరికి అంతకుముందే తీవ్రమైన బీపీ, షుగర్, కిడ్నీ, ఇతర తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ …

Read More »

RTC ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు – MLA బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ఈరోజు RTC ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (RTC JAC) నాయకులు ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ని కలిసి తమ సమస్యలను వివరించి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, RTC ఉద్యోగ సంఘాల JAC ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన న్యాయమైన డిమాండ్లకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు …

Read More »

అభివృద్ధికి ప్రాంతాల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ ఖాళీ స్థలాల్లో బోర్డ్ లు ఏర్పాటు చేసి, వాటి అభివృద్ధికి ప్రాంతాల వారీగా ప్రతిపాదనలు సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ నగరంలోని కృష్ణనగర్, కుందులరోడ్, నల్లపాడు, శ్యామల నగర్, విద్యా నగర్, గోరంట్ల తదితర ప్రాంతాల్లో పర్యటించి జిఎంసి ఖాళీ స్థలాలు, అభివృద్ధి పనులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కి దరఖాస్తు చేసుకున్నభవనాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత …

Read More »

బీసీ సంక్షేమ వసతి గృహాల మెస్ చార్జీలు 25 శాతం పెంచాలి…

-జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహాల్లో (హాస్టళ్లలో) నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల నరసింహారావు, నగర అధ్యక్షులు సీరం నాగమల్లేశ్వర రావు డిమాండ్ చేసారు. గురువారం ధర్నా చౌక్ లో జాతీయ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ వసతి గృహాల అవసరాలు, మెస్ చార్జీలు, కనీస సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా …

Read More »

వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మేదర సురేష్‌కుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ‘రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల’ నియామకం జరిగింది. దానిలో భాగంగా పార్టీని నమ్ముకుని, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేసిన విజయవాడ సెంట్రల్ నుంచి మేదర సురేష్‌కుమార్‌ని రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మేదర సురేష్‌కుమార్ మాట్లాడుతూ పార్టీని నమ్మకున్న ప్రతివారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు వుంటుందని, దానికి నిదర్శనమే …

Read More »

భారత్ టెక్స్–2026 ఎక్స్పోలో ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ మరియు లేపాక్షి హస్తకళల స్టాల్స్‌ను సందర్శించిన మంత్రి సవితమ్మ – డా. పసుపులేటి హరిప్రసాద్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక భారత్ టెక్స్–2026 ఎక్స్పోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర BC సంక్షేమం, జౌళి శాఖ మంత్రి సవితమ్మ మరియు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ మరియు లేపాక్షి హస్తకళల ఎక్స్పో స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన ప్రముఖ టెక్స్టైల్ …

Read More »

ఢిల్లీలో మంత్రి సవితమ్మ కి ఘన స్వాగతం పలికిన డా. పసుపులేటి హరిప్రసాద్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర BC సంక్షేమ, జౌళి శాఖ మంత్రి సవితమ్మ కి ఢిల్లీలోని లీ-మెరిడియన్ హోటల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ లేపాక్షి సిబ్బందితో కలిసి ఘన స్వాగతం పలికారు.

Read More »

ఘన వ్యర్థాల నిర్వహణలో ప్రజారోగ్యానికి ప్రాధాన్యం

-కడప కార్పోరేషన్ సమీక్షా సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ కడప, నేటి పత్రిక ప్రజావార్త : కడప నగరంలో పారిశుధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రవాణా, శాస్త్రీయ నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టి ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. గురువారం కడప నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో కేఎంసి అదనపు కమిషనర్ రాకేష్ చంద్రంతో కలిసి ప్రజారోగ్య, పారిశుధ్య, ఇంజనీరింగ్ …

Read More »

వ్యర్థాల నిర్వహణలో ప్రజారోగ్య రక్షణకు అత్యంత ప్రాధాన్యత

-స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌ పరిశీలన కడప, నేటి పత్రిక ప్రజావార్త : కడప నగరంలో ఘన వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టడంతో పాటు ప్రజారోగ్య భద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కడప నగర పాలక సంస్థ పరిధిలోని కనుమలోపల్లి వద్ద నిర్వహణలో ఉన్న ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్‌ను ఆయన పరిశీలించారు. అక్కడి …

Read More »

సాంకేతికత ఎంత పెరిగినా ‘సంస్కృతే’ మన గుర్తింపు

-అన్నమయ్య సంకీర్తనల కళా వైభవం* -సంగీతం వ్యక్తిత్వ వికాసానికి మార్గం* -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎంతటి ఆధునిక సాంకేతిక విప్లవం వచ్చినా, భావితరాలు గ్లోబల్ సిటిజన్స్‌గా మారినా.. మన సంస్కృతి, కళలే మన ఉనికికి ఆధారాలు” అని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరు డాక్టరు జి.లక్ష్మీశ అన్నారు. రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ, కాకరపర్తి భావనారాయణ కళాశాల, అన్నమాచార్య భావన వాహిని సంయుక్త ఆధ్వర్యంలో డాక్టరు శోభారాజు ప్రత్యక్ష పర్యవేక్షణలో కేబీఎన్‌ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన అన్నమాచార్య …

Read More »