Breaking News

రాష్ట్రంలో 12 కొవిడ్‌ కేసులు

-నాలుగు జిల్లాల్లో చెదురుముదురుగా నమోదు
-పూణే ల్యాబ్ కు జన్యుక్రమ విశ్లేషణ నిమిత్తం 5 నమూనాలు
-జులై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా 339 కోవిడ్ కేసుల నమోదు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు చెదురుము దురుగా బయటపడ్డాయి జూన్‌ 26 నుంచి జులై 16 వరకు మొత్తం 12 మంది కోవిడ్ వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో నలుగురు మృతి చెందారు. వీరికి అంతకుముందే తీవ్రమైన బీపీ, షుగర్, కిడ్నీ, ఇతర తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీర పాండియన్ నేడొక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది తొలి కొవిడ్‌ కేసు జూన్‌ 26న కడప జిల్లాలో నమోదైంది. జులై 1 నుంచి 16 వరకు మరో 11 కేసులు బయటపడ్డాయి. వీరిలో ఇద్దరు కొవిడ్‌ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగినవారుగా గుర్తించారు. మొత్తం కేసుల్లో కడప జిల్లాలో అత్యధికంగా ఎనిమిది నమోదయ్యాయి. గుంటూరులో రెండు, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున వెలుగుచూశాయి. ఇవన్నీ వేర్వేరు మండలాలు, ప్రాంతాల్లో నమోదైనవేనని.. ఒకేచోట కేసులు గుంపుగా బయటపడలేదని
వీర పాండియన్ తెలిపారు

67 మందికి కోవిడ్ రీక్షలు

జూన్‌ 26 నుంచి జులై 15 వరకు రాష్ట్రంలో 67 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్‌గా తేలింది. కాకినాడ జిల్లాకు చెందిన
మరోకరికి తమిళనాడులోని వేలూరు సీఎంసీలో నిర్వహించిన పరీక్షలో వైరస్‌ నిర్ధారణైంది.

4 మరణాలు

కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినవారిలో కడప జిల్లాకు చెందిన ముగ్గురు, కాకినాడ జిల్లాకు చెందిన ఒకరు మృతి చెందారు. వీరందరికీ ముందునుంచే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. వైరస్‌ జన్యు స్వరూపాన్ని గుర్తించేందుకు ఐదు నమూనాలను జులై 9న పుణెలోని జాతీయ వైరాలజీ సంస్థకు జన్యుక్రమ విశ్లేషణ కోసం పంపించారు. ప్రస్తుతం ముగ్గురు స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇద్దరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రజల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తలు పాటించాలని, వైద్యులు, ఆసుపత్రులు సిబ్బందిని అప్రమత్తం చేశామని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీర పాండియన్ తెలిపారు

జిల్లాలవారీగా కేసులు

కడప — 8
గుంటూరు — 2
విశాఖపట్నం — 1
కాకినాడ — 1

మొత్తం కేసులు: 12

మరణాలు: 4

స్వీయ గృహ నిర్బంధం: 3
ఆసుపత్రుల్లో చికిత్స: 2
కోలుకున్నవారు: 3

అత్యధికంగా కేరళ రాష్ట్రంలో కేసులు నమోదు

దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి ఇప్పటివరకు 339 కోవిడ్ కేసులు రికార్డ్ అయ్యాయి. కేరళ రాష్ట్రంలో 115, కర్ణాటక రాష్ట్రంలో 64, మహారాష్ట్ర లో 43, తమిళనాడులో 39, అండమాన్ లో 18, ఢిల్లీలో 18, రాజస్థాన్లో 12, ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని కేసులు నమోదు అయ్యాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *