విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ‘రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల’ నియామకం జరిగింది. దానిలో భాగంగా పార్టీని నమ్ముకుని, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేసిన విజయవాడ సెంట్రల్ నుంచి మేదర సురేష్‌కుమార్‌ని రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పార్టీ అధ్యక్షులు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మేదర సురేష్‌కుమార్ మాట్లాడుతూ పార్టీని నమ్మకున్న ప్రతివారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు వుంటుందని, దానికి నిదర్శనమే నాకు దక్కిన ఈ సముచిత స్థానమన్నారు. తన మీద నమ్మకంతో పార్టీలో తనకు అప్పగించిన ఈ బాధ్యతను నిర్వహిస్తూ అందరినీ కలపుకుపోతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ పదవి దక్కడానికి సహకరించిన పార్టీ అధిష్టానానికి, పెద్దలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
Prajavartha Online Telugu News