అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ ఆధ్వర్యంలో ఫుల్ బెంచ్ సమక్షంలో ఘన వీడ్కోలు పలికారు.హై కోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్ చక్రవర్తి పదవీ విరమణ చేయనున్న సందర్భాన్ని పురష్కరించుకుని హైకోర్టు మొదటి కోర్టు హాల్లో శుక్రవారం ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ జస్టిస్ బీవీఎల్ఎన్ చక్రవర్తి నిబద్ధత కలిగిన న్యాయమూర్తని కొనియాడారు.జస్టిస్ చక్రవర్తి …
Read More »Daily Archives: August 14, 2026
పోలవరం సివిల్ వర్క్స్ 90 శాతం పూర్తయ్యాయి.
-వెలిగొండ నిర్వాసితులకు నెలాఖరులోగా 600కోట్లు ఇస్తాం. -విశాఖలో డేటాసెంటర్లకు 3 టిఎంసిల గోదావరి జలాలు. -36 ప్రాజెక్టుల నెలవారీ వర్క్ ఫ్రోగ్రెస్ ఇవ్వాలని సిఎం ఆదేశించారు. -రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా.నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం,వెలిగొండ ప్రాజెక్టు లతో పాటు మొత్తం 36 ప్రాధాన్యతా ప్రాజెక్టులు, ఐడిసి లిఫ్ట్స్ స్కీం, వంటి అంశాలతో పాటు,ఎల్ నినో వంటి సందర్భంలో త్రాగునీటి అవసరాల నిమిత్తం ఏ రకంగా ప్రణాళిక తీసుకుంటున్నాం అనే అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »విజయవాడ నగరంలో ఆగస్టు 15 వ తేదీ మధ్యాహ్నం నుండి మూడు రోజుల పాటు ‘అలంకృత శకటాల’ ప్రదర్శన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఆగస్టు 15 (శనివారం) నాడు అమరావతిలోని నేలపాడు గ్రౌండ్ వద్ద జరిగే ఇండిపెండెన్స్ డే పరేడ్ అనంతరం, విజయవాడ నగర ప్రజలు, పర్యాటకుల సందర్శనార్థం అలంకృత శకటాలను (Tableaux) ప్రదర్శించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ ఇంచార్జ్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ శకటాలు ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు నగరవాసులకు కనువిందు చేయనున్నాయన్నారు. నగరంలో ప్రజలందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా …
Read More »విద్యుత్ దీపాల అలంకరణతో ఆకట్టుకుంటున్న అసెంబ్లీ,సచివాలయ భవనాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ,సచివాలయ భవనాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ప్రతిబింబించేలా సచివాలయంలోని ఐదు భవనాలను ప్రత్యేక విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దారు.అసెంబ్లీ భవనాన్ని సైతం వివిధ రకాల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడంతో భవన సముదాయం విద్యుత్ కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది.అసెంబ్లీ,సచివాలయ ప్రాంగణాల్లోని రహదారులకు ఇరువైపులా, సెంట్రల్ పార్కులో వివిధ రంగులతో కూడిన ప్రత్యేక విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు.దీంతో మొత్తం ప్రాంగణం విద్యుత్ …
Read More »ఏపీ డ్వాక్రా సభ్యులకు PMFME – స్త్రీనిధి సరికొత్త పథకం
– ఆహార శుద్ధి రంగంలో సరికొత్త అవకాశాలు – రు. 3 లక్షల వరకు యూనిట్ వ్యయంతో యూనిట్ ఏర్పాటు – స్త్రీనిధి రుణంతో PMFME సబ్సిడీ – డ్వాక్రా సభ్యులు కూలి స్థాయి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి – మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డ్వాక్రా మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్ది… వారు ఉద్యోగం కోరుకునే స్థాయి నుంచి ఉపాధి కల్పించే పారిశ్రామిక వేత్తలుగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర సూక్ష్మ, …
Read More »ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పోలీస్ మెడల్’కు ఏపీ పోలీస్ అకాడమీ అసిస్టెంట్ కమాండెంట్ సయ్యద్ మహబూబ్ బాషా ఎంపిక
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రెండు దశాబ్దాలకు పైగా పోలీస్ శాఖలో విశిష్ట, ప్రశంసనీయమైన సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ (APPA) అసిస్టెంట్ కమాండెంట్ (డీఎస్పీ ర్యాంక్) సయ్యద్ మహబూబ్ బాషాను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (IPM) కు ఎంపిక చేసింది. విధి నిర్వహణ పట్ల అసాధారణమైన అంకితభావం, నిబద్ధత, నిష్కళంకమైన నిజాయితీ ఇంకా ఆదర్శప్రాయమైన వృత్తి నైపుణ్యాన్ని కనపరించినందుకు అత్యున్నతమైన జాతీయ ‘ఇండియన్ పోలీస్ మెడల్’ పురస్కారంతో సత్కరించనున్నారు. సయ్యద్ మహబూబ్ బాషా 1998లో పోలీసు …
Read More »పురుహూతిక అమ్మవారిని దర్శించుకున్న అన్నా కొణిదల
-శక్తి పీఠంలో ప్రత్యేక పూజలు విఅమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల పిఠాపురంలోని శ్రీ పాదగయ క్షేత్రాన్ని శుక్రవారం సందర్శించారు. అష్టాదశ శక్తి పీఠాల్లో భాగమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆమెకు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు.
Read More »కనీసం ప్రజాస్వామ్యం కరువు
-మూడవసారి పాలన ముదునుష్ఠమే -మోడీ పాలనపై మండిపడ్డా మాజీ మంత్రి వడ్డే విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో కనీసం ప్రజాస్వామ్యం కరువైందని, మోడీ మూడవసారి అధికారం ముదునుష్ఠ పాలనేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మండిపడ్డారు. నగరంలోని గాంధీనగర్ ప్రసెక్లబ్ లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. 80 వ స్వాతంత్ర దినోత్సవం వచ్చిన, ఎన్ని పంచవర్ష ప్రణాళికలు జరిగిన పేదవాడి, రైతు బతుకు మారకపోగా అథోగతి పాలైందని బిజెపి నాయకత్వంలోని కేంద్ర ఎన్ డిఏ ప్రభుత్వాన్ని విమర్శించారు. …
Read More »అసెంబ్లీకి రా…నీకు నచ్చిన అంశంపై చర్చిద్దాం
-నీలా మేం దూషించం… అవమానించం -ఒకరోజు కాకపోతే రెండ్రోజులైనా చర్చకు మేం రెడీ -కళ్లున్న కబోదిలా .. ప్రెస్ మీట్ ల్లో మాట్లాడడం కాదు -పులివెందుల ఎమ్మెల్యేగా సభకు రా… -జగన్ కు మంత్రి సవిత సవాల్ -గ్రూప్ 1 లో అక్రమాలు బయటకు రావడంతోనే గొడ్డలి పార్టీ డ్రామాలు -మెగా డీఎస్సీపై డైవర్షన్ రాజకీయాలు -విద్యార్థులతో ధర్నాలు సిగ్గు చేటు -రైజింగ్ రాయలసీమే సీఎం చంద్రబాబు లక్ష్యం : మంత్రి సవిత -అర్హులందరికీ ‘నేతన్నల సేవలో’ అందిస్తాం -పథకాలను లబ్దిదారులు అందజేయాల్సిన బాధ్యత …
Read More »టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయ నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురామ్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్, గద్దె రామమోహన్, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, ఇతర ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, …
Read More »
Prajavartha Online Telugu News