ఈనెల ఆరో తేదీన 68వ జాతీయ స్కూల్ గేమ్స్ వాలీబాల్ టోర్నమెంట్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల ఆరో తేదీ సోమవారం నుండి పదో తేదీ వరకు నగరంలోని సిద్ధార్థ జూనియర్ కాలేజ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించే 68వ జాతీయ స్కూల్ గేమ్స్ వాలీబాల్ టోర్నమెంట్ కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్టేట్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ, జనరల్ అబ్జర్వర్ జి. భానుమూర్తి రాజు తెలిపారు. నగరంలోని సిద్ధార్థ జూనియర్ కాలేజ్ ప్రాంగణంలో 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ లో భాగంగా నిర్వహించే అండర్ 19 బాలికల వాలీబాల్ టోర్నమెంట్ కు చేసిన ఏర్పాట్లపై మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 6వ తేదీ సోమవారం నుండి 10 వ తేదీ వరకు ప్రతిష్టాత్మక ఈవెంట్‌ కు దేశం నలుమూలల నుండి 26 జట్లు పాల్గొని, వారి ప్రతిభను, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు పోటీపడతరన్నారు.

టోర్నమెంట్ లో క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొంటూ అన్ని జట్లకు, అధికారులకు సౌకర్యవంతమైన ఆరు 3-నక్షత్రాల హోటళ్లలో ఆతిథ్యం, బస ఏర్పాటు చేశామన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే క్రీడాకారులకు వారి ఆహార అలవాట్లు ప్రాధాన్యతలకు అనుగుణంగా అన్ని రకాల దక్షిణ, ఉత్తర భారత వంటకాలు అందుబాటులో ఉంచామన్నారు. క్రీడాకారులు, అధికారులకు ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలు సందర్శించేందుకు వీలుగా ఏర్పాటు చేశామన్నారు. సాయంత్రం ఫ్లడ్‌లైట్ వెలుగుల్లో అన్ని సౌకర్యాలతో నాలుగు కోర్టులతో సహా ఆరు జాతీయ స్థాయి వాలీబాల్ కోర్టులలో మ్యాచ్‌లు నిర్వహించబడతాయన్నారు. లీగ్-కమ్-నాకౌట్ ఫార్మాట్‌ లో పోటీలు నిర్వహిస్తామన్నారు. టోర్నమెంట్‌ ను విజయవంతంగా నిర్వహించేందుకు 17 ఆర్గనైజింగ్ కమిటీలు సమన్వయంతో అందుబాటులో ఉంచామన్నారు. ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకు టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని ఎటువంటి లోటుపోట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్టేట్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ, జనరల్ అబ్జర్వర్ జి. భానుమూర్తి రాజు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మస్టర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వార్డ్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు మస్టర్ సమయంలో తప్పనిసరిగా ప్రజారోగ్య కార్మికుల హాజరు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *