మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఐఏఎస్ అధికారిగా ఉంటూ డీకే బాలాజీ 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేయడం గొప్ప విషయమని ఆంధ్ర ప్రదేశ్ యోగాసభ మచిలీపట్నం విభాగం యోగా గురువులు గురునాథ బాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ డికె బాలాజీ, ఐఎఎస్, రధసప్తమి సందర్భంగా గత ఫిబ్రవరి నెల 2 వ తేదీన కృష్ణాజిల్లా పరిషత్ ఫంక్షన్ హాల్ లో 150 మంది యోగా సభ్యులతో కలిసి 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేసారు. 108 రౌండ్ల సూర్య నమస్కారాలు చేసినందుకు జిల్లా కలెక్టర్ బాలాజీని ఆల్ ఇండియా యోగా ప్రిన్సిపల్ యోగాచార్య డా.దమయంతి శర్మ అభినందించారు. డా. దమయంతి శర్మ ఇచ్చిన అభినందన సర్టిఫికెట్ ను ఆదివారం ఉదయం నగరంలోని ఉదయపు నడక మిత్రమండలి భవనంలో యోగా సభ్యుల హర్షధ్వానాల మధ్య యోగా గురువులు గురునాధబాబు, మహాలక్ష్మి, చింతయ్య, రమేష్ కలెక్టర్ డికె బాలాజీ కి అందించారు.
