-ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ,నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీక అని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) అన్నారు. సోమవారం భవానిపురం లోని హజ్రత్ గాలిబ్ షాహిబ్ దర్గా ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారం తినిపించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మనుషులంతా సోదర భావంతో ఉండాలని అందరూ బాగుండాలని సుజనా ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో దర్గా ప్రెసిడెంట్, ముస్తాక్ అహ్మద్, అల్తాఫ్, ఎన్డీయే కూటమి నేతలు నాగుల్ మీరా, అడ్డూరి శ్రీరామ్, ఎమ్మెస్ బేగ్, బొమ్మసాని సుబ్బారావు, అబ్దుల్ ఖాదర్, గుర్రంకొండ, మరుపిళ్ళ రాజేష్, అత్తలూరి ఆదిలక్ష్మి పెదబాబు, మహాదేవు అప్పాజీరావు, యే దుపాటి రామయ్య, కూటమినేతలు పాల్గొన్నారు.