Breaking News

ఉగ్రవాదుల దాడిని ముక్తకంఠంతో అంతా ఖండించాలి

-కశ్మీర్ లో ప్రశాంతతకు భంగం కలిగించేందుకే ఉగ్ర కుట్ర
-ప్రధాని మోదీ  చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకే దాడులు
-క్లిష్ట సమయంలో కలసికట్టుగా నడవాలని జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు
– పవన్ కళ్యాణ్  పిలుపు మేరకు పార్టీ తరఫున మూడు రోజుల సంతాప దినాలు
-జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
-పహల్గాం ఉగ్ర దాడి మృతులకు సంతాపంగా మంగళగిరిలో జనసేన పార్టీ కొవ్వొత్తుల ప్రదర్శన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘పహల్గాం ఉగ్రదాడి దుర్మార్గమైన చర్య. అమాయకులైన పర్యాటకులను లక్ష్యంగా చేసుకొని ముష్కరులు తూటాల వర్షం కురిపించడం దేశంలోని ప్రతి పౌరుడిని కదిలించింది. ఈ దుశ్చర్యలో 28 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  పిలుపు మేరకు పార్టీ తరఫున మూడు రోజులు సంతాప దినాలు పాటిస్తున్నామ”ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి  నాదెండ్ల మనోహర్  తెలిపారు. జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నేతన్న కూడలి వద్దనున్న భారీ జాతీయ పతాకం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించి మృతులకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రదర్శనలో శ్రీ నాదెండ్ల మనోహర్ గారితోపాటు శాసనమండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, నెల్లిమర్ల శాసన సభ్యురాలు లోకం నాగ మాధవి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “మతం పేరిట ఇంతటి మారణహోమం సృష్టించడం హేయమైన చర్యగా జనసేన పార్టీ భావిస్తోంది. దేశంలో ఎన్నో కులాలు, మరెన్నో మతాలు ఉన్నా అంతా ఐక్యంగా, సుహృద్భావంతో ఉన్నాము. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు మనందరం కలిసి మెలిసి ముందుకెళ్లేలా మన పెద్దలు ఎప్పటి నుంచో గొప్ప సంప్రదాయాన్ని మనకు నేర్పించారు. మన దేశం అభివృద్ధిపథంలో ముందుకు వెళ్లాలన్నా, ఇతర దేశాలతో మనం పోటీ పడి నిలవాలన్నా మనం ఐక్యంగా ఉండటం ముఖ్యం. కశ్మీర్ లో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. ఆ చర్యలకు భంగం వాటిల్లేలా ఉగ్రవాదులు ఇటువంటి చర్యలకు పాల్పడ్డారు. వారు ఏ దేశానికి చెందిన వారైనా పార్టీలు, ప్రాంతాలు, మతాలకు అతీతంగా అందరం ముక్త కంఠంతో ఖండించాలి.

సమాజానికి బలమైన సందేశాన్ని ఇద్దాం
ఉగ్ర దాడి సమాచారం తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ చలించిపోయారు. సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియపరిచారు. ఇటువంటి క్లిష్ట సమయంలో మనమంతా ముక్త కంఠంతో కలసి నడవాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ పక్షాన మృతులకు సంతాపం తెలియచేస్తూ మూడు రోజులపాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించి యావత్ భారతావనికి బలమైన సందేశం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఆయన సూచనల మేరకు ఈ రోజు ఉదయం జనసేన పార్టీ కార్యాలయాలతోపాటు నాయకుల ఇళ్లపై ఉన్న పార్టీ జెండాను అవనతం చేశాం. సాయంత్రం ప్రధాన కూడళ్లలో కొవ్వొత్తులు వెలిగించి మృతుల ఆత్మకు శాంతి చేకూరాని సంతాపం తెలిపాం. రేపు మౌన ప్రదర్శన చేపడతాం. మూడవ రోజు మానవహారాలు చేపడతాం. చివరి రోజు కార్యక్రమంలో పవన్ కళ్యాణ్  స్వయంగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఛైర్మన్  తమ్మిరెడ్డి శివశంకర్, మెడికల్ సర్వీసెస్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఛైర్మన్  చిల్లపల్లి శ్రీనివాసరావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్  చిలకలపూడి పాపారావు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల అధ్యక్షులు సామినేని ఉదయభాను,  బండ్రెడ్డి రామకృష్ణ,  గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు  నయూబ్ కమాల్, సయ్యద్ జిలాని, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్, బేతపూడి విజయ్ శేఖర్, వివిధ నియోజకవర్గాల ఇంఛార్జులు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లు, వీర మహిళా విభాగం నాయకురాళ్లు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు, జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *