Breaking News

మచిలీపట్నంకు సరికొత్త శొభగులు అద్దుతాం

-డ్రైన్లలో పూడిక తొలగింపుకు రూ.171 కోట్లు
-పీపీపీ పద్దతిలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు
-శ్మశానాల అభివృద్ధికి డీపీఆర్ లు సిద్ధం
-మాతృభూమికి సేవ చేయడానికి ఎన్ఆర్ఐలు ముందుకు రావడం హర్షనీయం
-డంపింగ్యార్డు స్థానంలో అక్టోబర్ 2 నాటికి నూతన పార్కు సిద్ధం చేస్తాం
-స్వదేశీదర్శన్ క్రింద రూ.120 కోట్ల ప్రపోజల్స్ పంపించాం
-మచిలీపట్నం అభివృద్ధికి అందరూ భాగస్వామ్యం కావాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నంను సరికొత్త రూపు సంతరించడానికి బ్యూటిఫికేషన్లో భాగంగా స్థానికతకు, కల్చర్కు పెద్దపీట వేస్తూ గోల్డ్ కవరింగ్, కళంకారీ, ఫిషరీస్ లుక్తో నూతన శోభను చేకూర్చడానికి సన్నాహాలు చేస్తున్నామని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర అన్నారు.
నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో కనీవినీ ఎరుగని అభివృద్ధిని చేసి చూపిస్తానన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో ఏడాదికి రూ.33 వేల కోట్లను పెన్షన్లుగా అందిస్తున్నామన్నారు. ఉచిత గ్యాస్ సిలెండర్ల పథకంలో భాగంగా దాదాపు కోటి మందికి ఉచిత గ్యాస్ సిలెండర్లు అందిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం తాజాగా 16 వేలకు పైగా డీఎస్పీ ద్వారా ఉపాధ్యాయుల నియామకానికి నోటిఫికేషన్ ఇప్పటికే ఇవ్వడం జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క డీఎస్సీ పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు.

మచిలీపట్నం సంస్కృతిని చాటిచెప్పేలా పట్టణ పట్టణానికి సుందర రూపం చేకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరంలోని డ్రైవ్లలో పూడిక తొలగింపునకు ఇప్పటికే టెండర్లు పిలిచామని, ఈ పనుల కోసం రూ.171 కోట్లు ఫైనాన్స్ అనుమతి కోసం వున్నాయని అనుమతులు రాగానే యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభిస్తామన్నారు. వీటికి అనుబంధంగా మరో రూ.13 కోట్లకు అనుమతులు రాగానే పనులు చేస్తామన్నారు. కాలువలు కూడా వీటి పారుదలకు అవరోధాలు లేకుండా శుభ్రం చేయిస్తామన్నారు. సీఎస్ఆర్ విధులు కూడా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కోనేరు సెంటర్ మున్సిపల్ కార్యాలయం, బేబీ సెంటరీ, పాతకూరగాయల మార్కెట్ను పీపీపీ పద్దతిలో రూ.100 కోట్లతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. శ్మశానవాటికల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నామని, ప్రధాన శ్మశాన ఆధునీకరణకు రూ.1.50 కోట్లు డీపీఆర్ సిద్ధం చేశామన్నారు. ఈ మేరకు దాతలు ముందుకు వచ్చారవి, కమిటీ వేసి పనులు ప్రారంభించనున్నామన్నారు. అలాగే చిలకలపూడి శ్మశానాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు గ్రీన్ సంస్థ ముందుకు రావడం హర్షనీయమన్నారు. ఈ ప్రాంత ఎన్ఆర్ ఐలు మాతృభూమికి సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారని, అభివృద్ధి పనుల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నామని, అవసరాల ప్రాధాన్యతబట్టి ఒక్కొక్కటి పూర్తి చేస్తామని వివరించారు.

మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పీ-4లో భాగంగా బంగారు కుటుంబాలను గ్రామాల వారీగా గుర్తించాలని ఇప్పటికే ఆదేశాలు జారీచేయడం జరిగిందన్నారు. పేదరికంలో వున్న కుటుంబాలను ఆర్దికంగా అభివృద్ధి బాటలో నడిపించేందుకు మార్గదర్శులు సిద్ధంగా ఉన్నారని, పేదల అభివృద్ధి బాటలు వేయడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధమే అన్నారు. నగర డంపింగ్ యార్డును పూర్తిగా శుభ్రం చేసి అక్టోబర్ 2 నాటికి సుందరమైన పార్కుగా రూపొందించనున్నామన్నారు. టూరిజం డేవలప్మెంట్ లో భాగంగా మంగినపూడి బీచ్ లో వర్షాకాలం అనంతరం టెంపరరీ టెంట్లు ఏర్పాట్లు చేయాలనే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. స్వదేశీదర్శన్ క్రింద రూ.120 కోట్ల ప్రపోజల్ను ముఖ్యమంత్రి ద్వారా కేంద్రానికి పంపనున్నట్లు తెలిపారు. అలాగే మరో వారం రోజులలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిసి మంగినపూడి బీచ్ ఫెస్టివల్ కు ఆహ్వానించనున్నట్లు తెలిపారు. టూరిజం, పరిశ్రమలస్థాపనతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. మచిలీపట్నం అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యులు అవ్వాలని, బందరుకు సరికొత్త రూపాన్ని సంతరించేందుకు తోడుగా నిలవాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *