Breaking News

ప్రతి గ్రామానికి బ్రాడ్ బ్యాండ్ సేవలందించేదుకు కృషి… : సిఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని పట్టణాలతోపాటు ప్రతి గ్రామానికి మెరుగైన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ పేర్కొన్నారు.సోమవారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ద్వితీయ స్టేట్ బ్రాడ్ బ్యాండ్ కమిటీ సమావేశం ‌ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసమావేశంలో ప్రధానంగా ఇండియన్ టెలిగ్రాఫ్ రైట్ అఫ్ వే రూల్స్ 2016 ప్రకారం ఆర్ఓడబ్ల్యు పాలసీ నోటిఫై చేయడం, స్టేట్ ఆర్ ఓడబ్ల్యు పోర్టల్ అమలు, నేషనల్ బిల్డింగ్ కోడ్ 2016 అమలు, ఆర్ఓడబ్ల్యు పెండింగ్ కేసులు, రాష్ట్రంలో బ్రాడ్ బ్యాండ్ పెనిట్రేషన్ సేవలను ప్రోత్సహించడం వంటి అంశాలపై సమీక్షించారు.

ఈసందర్భగా సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 2022 నాటికి నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ కింద ప్రతి గ్రామానికి హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తేవాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో త్వరితగతిన అన్ని గ్రామాలకు బ్రాడ్ బ్యాండ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.త్వరలో నూతన ఐటి విధానాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించనుందని దానివల్ల బ్రాడ్ బ్యాండ్ సేవలను గ్రామ స్థాయి వరకూ విస్తరించేందుకు ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. రాష్ట్రంలో భూరీ సర్వే ప్రక్రియలో బ్రాడ్ బ్యాండ్ సేవలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని డిజిటలైజ్ చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ పేర్కొన్నారు.మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇంకా బ్రాడ్ బ్యాండ్ సేవలు విస్తరణకు అడ్డంకిగా ఉన్న అటవీ శాఖ క్లియరెన్స్ లు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామని సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ చెప్పారు. సమావేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం శాఖ డిడిజిలు రామ్ కృష్ణ, రాఘవేంద్ర రావు తదితరులు బ్రాడ్ బ్యాండ్ సేవల విస్తరణకు సంబంధించిన వివిధ అజెండా అంశాలపై మాట్లాడారు. ఈసమావేశంలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్మి, పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం సీనియర్ డిడిజి జివి.రామకృష్ణ,డిడిజి జి‌.రాఘవేంద్ర,వెంకటేశం,ఎస్సి ఆర్ అండ్ బి టి.మురళీ కృష్ణ, పంచాయతీ రాజ్ శాఖ ఇఎన్సి సుబ్బారెడ్డిఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నియోజకవర్గ పరిధిలోని పట్టభద్రులను ఓటింగ్ కు తీసుకువచ్చేలా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శనివారం అశోక్ నగర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *