మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ మేర యువ భారత్ మై భారత్ ఆధ్వర్యంలో స్థానిక మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల నందు బ్లాక్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి ఆదేశాల మేరకు ఫిట్ ఇండియా మరియు ఫిజికల్ యాక్టివిటీస్ ని ముందు తీసుకెళ్లడంలో మై భారత్ మేరా యువభారత్ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మైలవరం లక్కిరెడ్డి బాలి రెడ్డి కళాశాల నందు బాయ్స్ క్యాటగిరీ వాలీబాల్ షాట్ పుట్ మరియు రన్నింగ్ ఉమెన్స్ క్యాటగిరి కబాడీ రన్నింగ్ షార్ట్ పుట్ వంటి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ను నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కళాశాల వయసు ప్రిన్సిపల్ డాక్టర్ బి రమేష్ రెడ్డి గారు మరియు స్థానిక మైలవరం స్టేషన్ ఎస్ఐ కృష్ణా రెడ్డి ఎన్ఎస్ఎస్ యూనిట్ అధికారి శివహరి ప్రసాద్ అసిస్టెంట్ ఎన్ఎస్ఎస్ అధికారి ఎస్ ఉమామహేశ్వర్ రెడ్డి ఫిజికల్ డైరెక్టర్ ఎన్ వి రాజ్ కుమార్ మరియు బేబీ రాణి మరియు మైభారత్ టీం తదితరులు పాల్గొని నిర్వహించి గేమ్స్ లో కబాడీ మరియు వాలీబాల్ నందు పాల్గొన్న పురుషులకు భాగం మరియు మహిళా విభాగం విన్నర్స్ కి మరియు రన్నర్స్ కి సర్టిఫికెట్స్ తో పాటు మెడల్స్ కప్పులను అందించడం జరిగింది.
అదేవిధంగా అథ్లెటిక్స్ రన్నింగ్ అండ్ షాట్ పుట్ నందు పాల్గొన్న పురుషులు మరియు మహిళలకు మొదటి దద మరియు రెండో బహుమతి మరియు మూడో బహుమతి కింద మెడల్స్ మరియు కప్స్ ను అందజేయడం జరిగింది.
Prajavartha Online Telugu News