-ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా ఒక సంవత్సరం పాటు ఉచిత మరియు రాయితీలతో న్యూరాలజీ వైద్యసేవలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరల్డ్ (స్ట్రోక్ ఆర్గనైజేషన్ 2016లో అక్టోబర్ 29వ తేదీని ప్రజల్లో స్ట్రోక్ పట్ల అవగాహన కలిగించేందుకు ప్రపంచ స్ట్రోక్ దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ కారణాలు, ప్రభావాలు, నివారణ మరియు సమయానికి చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.
స్ట్రోక్ అంటే..
స్ట్రోక్ అనేది మెదడుకు రక్తప్రవాహం ఆకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళం చిట్టిపోవడం వల్ల మెదడులో కణజాలం దెబ్బతినే పరిస్థితి. ఇది గుండెజబ్బుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరణానికి రెండవ ప్రధాన కారణం.
భారతదేశంలో స్ట్రోక్ గణాంకాలు:
– ప్రతి సంవత్సరం సుమారు 18 లక్షల కొత్త స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి..
– ప్రతి 6 సెకన్లకు ఒక వ్యక్తి స్ట్రోక్ కి గురవుతున్నారు.
– 40 ఏళ్ల లోపు యువకుల్లో 25% కేసులు నమోదవుతున్నాయి..
– అధిక రక్తపోటు, మధుమేహం, ధూమపానం, అధిక బరువు అదుపులో వుంచుకుంటే 90% స్ట్రోక్లు నివారించవచ్చు
– స్ట్రోక్ లక్షణాలు కనిపించిన 4.5 గంటల్లో చికిత్స పొందితే 80% మంది పూర్తిగా కోలుకోవచ్చు.
– సాధారణంగా సంభవించే స్ట్రోక్లలో 87% ఇస్కిమిక్ స్ట్రోక్ ద్వారానే సంభవిస్తున్నాయి.
– స్ట్రోక్ కు ప్రధాన ప్రమాద కారకాలు: అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, ధూమపానం, అధిక మద్యపానం, వ్యాయామం లేకపోవడం, అధిక ఉప్పు, కొవ్వుతో కూడిన ఆహారం తీసుకోవడం
BE FAST – స్ట్రోక్ లక్షణాలు గుర్తించండి:
B – Balance: సమతుల్యత కోల్పోవటం
E – Eyes: చూపు మందగించడం
F – Face: ముఖం వంకరపోవడం
A – Arms: చేయి బాలహీనపడటం
S – Speech: మాటల్లో అస్పస్తత
T – Time: వెంట్నే వైద్య సహాయం పొందాలి
ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం సందర్భంగా ఆఫ్టర్ రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతినేని రమేష్ బాబు మాట్లాడుతూ “స్ట్రోక్ అనేది అకస్మాత్తుగా జరిగే అత్యవసర వైద్య పరిస్థితి, ప్రతి నిమిషం విలువైనది. సమయానికి సరైన ఆసుపత్రికి చేరితే మెదడులో మరణించే కణాలను రక్షించవచ్చు. ప్రజల్లో అవగాహన పెరిగి, గోల్డెన్ అవర్లో చికిత్స అందించగలిగితే చాలా మంది రోగులు సాధారణ జీవితం తిరిగి పొందుతారని తెలియచేసారు. స్ట్రోక్ డే అవగాహన కార్యక్రమాలలో భాగంగా కోడూరు మరియు గుడివాడలో వాక్‌థాన్, బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణ, ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించగా ప్రజల నుండి విశేష స్పందన లభించిందని తెలియచేస్తూ అస్టర్ రమేష్ హాస్పిటల్స్ ‘రామ్ కస్తూరి స్ట్రోక్ సెంటర్’ పేరుతో ప్రత్యేకమైన స్ట్రోక్ సెంటర్ ను 2011లో ప్రారంభించి, ఇప్పటివరకు 5 వేలకు పైగా రోగుల ప్రాణాలను కాపాడిందని డా. లక్ష్మీ అనూష, డా. హరిణి, డా. ప్రశాంత్, డా. రాజేష్ లతో కూడిన నలుగురు పూర్తి కాలపు న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్ డా. వృద్వి, డీ.ఎం ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డా. మహేష్ తో కూడిన వైద్య బృందం తో పాటు 256 స్లైస్ సీటీ స్కానర్, 1.5 టెస్లా ఎంఆర్ఐ, ట్రాన్స్ క్రేనియల్ డాప్లర్, ఈఈజీ, ఈఎన్ఎంజీ, నాడీ కండక్షన్ స్టడీ, కెరోటిడ్ డాప్లర్ వంటి ఆధునిక పరికరాలతో స్ట్రోక్ ప్రోటోకాల్స్ కు అనుగుణంగా 24X7 గోల్డెన్ ఆవర్లోనే థ్రాంబోలిసిస్ మరియు మెకానికల్ థ్రాంబెక్టమీ వంటి ఆధునిక చికిత్సలు అందించడం ద్వారా స్ట్రోక్ టీమ్ సేవలందిస్తుందని తెలియచేసారు.
సంస్థాగత సామాజిక బాధ్యతగా (స్ట్రోక్ పేషెంట్లకు సత్వర వైద్య చికిత్సను అందించటానికి ఒక సంవత్సరం పాటు 50 వేల మంది రోగులకు అస్టర్ రమేష్ హాస్పిటల్స్ అన్ని శాఖలలో మరియు 26 అవుట్ రీచ్ సెంటర్ల నందు ప్రతిరోజు మొదట రిజిస్టర్ చేసుకున్న 5 గురు పేషెంట్లకు ఉచిత కన్సల్టేషన్ మరియు రాయితీలతో వైద్యపరీక్షలు నిర్వహిస్తామని “కాల్ రమేష్ యాప్” మరియు “కాల్ సెంటర్” 0866-2463463 నందు సంప్రదించి.. అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందిగా తెలియచేసారు.
Prajavartha Online Telugu News