Breaking News

నగరాభివృధిలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పాత్ర కీలకం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరాభివృధిలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పాత్ర కీలకం అని, ఆ ప్రాంతాలలో గల సమస్యలను తెలియజేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ మెంబర్స్ తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నగర పరిధిలో గల వెల్ఫేర్ అసోసియేషన్ ఉన్న ప్రాంతాలలో గల సమస్యలను తమకు తెలియజేయాలని, ప్రతి చిన్న సమస్యనైనా క్షేత్రస్థాయిలో వారేచూడగలరని కావున నగరాభివృద్దికి వారు కూడా సహకరించాలని అన్నారు. ఈ సమావేశంలో రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వి. వెంకటేశ్వరరావు, సెక్రెటరీ కే.జీ రామారావు, సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *