Breaking News

ఏపీ జేఏసీ చైర్మైన్ ఎ విద్యా సాగర్ ని మర్యాదపూర్వకంగా కలసిన టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ నాయకులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక గాంధీనగర్ లోని ఏపీ ఎన్జీవో హోం లో శుక్రవారం ఏపీ ఎన్జీజీఓస్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ జేఏసీ చైర్మైన్ ఎ విద్యా సాగర్ ను నూతనంగా ఎన్నికైన టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ అధ్యక్షులు ఆర్. ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి యండి ఎల్ సిద్దిక్ ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. డిపార్ట్మెంట్ లో టెక్నికల్ ఆఫీసర్స్ కు సంబంధించిన విషయాలపై, వాళ్ళ సమస్యలపై చర్చించారు. విద్యా సాగర్ మాట్లాడుతూ డిపార్ట్మెంట్లో సమస్యలను పరిష్కరించుకున్నందుకే సంఘాలు ఉన్నాయని వాటిని పరిష్కరించే విధంగా సంఘ సభ్యులు పనిచేయాలన్నారు. సమస్యల పట్ల పూర్తి అవగాహనతో సంఘ నాయకులు ఉన్నప్పుడే సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించడానికి వీలుంటుందన్నారు. సమస్యలను అధికారులకు వివరించి, ఒప్పించే విధంగా ఉండాలన్నారు. మీకు ఏ సమస్యలున్న మా దృష్టికి తీసుకుని వచ్చినట్లయితే ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటామని విద్యాసాగర్ హామీ ఇచ్చారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహధ్యక్షులు వై సురేష్ బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ యం ఎస్ వి ప్రకాష్, కాశీ విశ్వనాధ్, జాయింట్ సెక్రటరీ మనీషా, కోఆర్డినేటర్ యండి అలీ, డి సోనీ ప్రియ, శివరామ కృష్ణ గౌడ్, జోన్3 ప్రెసిడెంట్ వి బాలకృష్ణ, జోన్2 ప్రెసిడెంట్ జీవిఎస్ న్ మూర్తి, వాళ్ళతో పాటుగా నాన్ టెక్నికల్ ఎంప్లాయిస్ జోన్2 అధ్యక్షులు యం. రాజుబాబు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *