Breaking News

తెలంగాణ పురుషుల్లో జుట్టుతో పాటే వేగంగా క్షీణిస్తున్న జీర్ణక్రియ సామర్థ్యం కూడా..! త్రాయ హెల్త్ అధ్యయనంలో విస్తుపోయే నిజాలు

-1.6 లక్షల మంది భారతీయ పురుషుల పై నిర్వహించిన అధ్యయనంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జీర్ణఆరోగ్యం అత్యంత వేగంగా క్షీణిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ తొలిస్థానంలో నిలిచింది. పురుషుల్లో జుట్టురాలడం మరియు జీర్ణఆరోగ్యానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు పరిశోధన ఫలితాలు సూచిస్తున్నాయి.

హైదరాబాద, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో జుట్టు రాలుదల సమస్యలకు పరిష్కారాలు అందిస్తున్న ప్రముఖ బ్రాండ్‌ త్రాయ హెల్త్‌ నిర్వహించిన జాతీయ గట్‌-హెయిర్‌హెల్త్‌ అధ్యయనం తెలంగాణలో నిశ్శబ్దంగా ముదురుతున్న ఆరోగ్యసం క్షోభాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దేశంలోని పది ప్రధాన ప్రాంతాలపై 2024డిసెంబర్‌ నుంచి 2025డిసెంబర్‌ వరకుసేకరించిన 1.6లక్షల మందికి పైగా భారతీయ పురుషుల స్వీయ ఆరోగ్య వివరాలను ఈ అధ్యయనం పోల్చింది. జీర్ణ వ్యవస్థ పని తీరును అంచనా వేయడానికి మలబద్ధకం తరచుదల్ని ప్రధాన సూచికగా తీసుకుని, పురుషుల్లో జుట్టు రాలుదలతో సంబంధం ఉన్న మార్పులను విశ్లేషించింది. అధ్యయనంలో భాగమైన పది రాష్ట్రాల్లో తెలంగాణలోనే జీర్ణ ఆరోగ్యం అత్యధికంగా క్షీణించినట్లు తేలింది.

తెలంగాణ పరిస్థితి
ఆరోగ్యకరమైన జీర్ణ క్రియకు సూచికగా భావించే “మలబద్ధకం తక్కువగా లేదా లేకపోవడం” తెలిపిన తెలంగాణ పురుషుల శాతం 2024 డిసెంబర్‌లో 19.13% ఉండగా, 2025 డిసెంబర్‌కు 15.03%కు పడిపోయింది. ఏడాదిలోనే 4.10 శాతం పాయింట్ల పడిపోవడం నమోదైంది. అధ్యయనంలో ఇది రాష్ట్రస్థాయిలో నమోదైన అతి పెద్ద క్షీణత. రాష్ట్ర జనాభా పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ తగ్గుదల వేలాది మంది పురుషులు తెలియకుండానే దీర్ఘకాలిక జీర్ణ సమస్యల వైపు జారుతున్నారనే సంకేతంగా నిపుణులు చెబుతున్నారు.

State / Region Dec 2024 Dec 2025 Change (pp)
Telangana 19.13% 15.03% −4.10%
Rajasthan 23.18% 19.87% −3.30%
Delhi NCR 22.75% 19.78% −2.97%
Madhya Pradesh 24.36% 22.06% −2.30%
Gujarat 24.05% 21.78% −2.27%
Bihar 26.27% 24.27% −2.00%
Uttar Pradesh 25.47% 23.65% −1.81%
Maharashtra 20.57% 18.77% −1.80%
Tamil Nadu 17.92% 16.62% −1.30%

దేశంలో అత్యంత పట్టణీకరణ, విద్యావంతుల శాతం, ఆర్థిక చురుకుదనం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. హైదరాబాద్‌ దేశ ఐటీ రంగానికి కేంద్రంగా నిలుస్తోంది. ఇదే సమస్యకు ప్రధాన కారణమవుతోందని త్రాయ హెల్త్‌ పేర్కొంది.
ఆధునిక పట్టణ జీవనశైలి కారణాలు జీర్ణ ఆరోగ్య క్షీణతకు దారితీస్తున్న ప్రధాన అంశాలుగా గుర్తించింది:
● 10 నిమిషాల డెలివరీ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల సులభంగా అందుబాటులోకి వచ్చిన అధికంగా ప్రాసెస్‌ చేసిన ఆహారం
● ఐటీ, సర్వీసెస్‌ రంగాల్లో నిరంతర పని సంస్కృతి కారణంగా అసమయ భోజనాలు
● వరుస పనులతో నీరుతాగడంలో నిర్లక్ష్యం
● ఒత్తిడిని తగ్గించుకోవడానికి అలవాటైన స్ట్రెస్‌ ఈటింగ్‌

జీర్ణ క్రియ–జుట్టు సంబంధం
మన జీర్ణ వ్యవస్థనే జుట్టుకు అవసరమైన పోషకాల సరఫరా గొలుసుగా నిపుణులు వివరిస్తున్నారు. జుట్టు ప్రధానంగా ప్రోటీన్‌తో తయారవుతుంది. ఐరన్‌, జింక్‌, విటమిన్లు వంటి పోషకాలు జుట్టు మూలాలకు చేరాలంటే ముందుగా అవి పేగుల ద్వారా శోషించబడాలి. జీర్ణ క్రియ బలహీనపడితే శరీరం అవసరమైన పోషకాలను ముఖ్య అవయవాలకు మళ్లిస్తుంది. జుట్టుకు మిగిలినదే అందుతుంది. దీని ప్రభావం కాలక్రమేణా జుట్టు రాలుదలగా కనిపిస్తుంది. అలాగే బలహీనమైన జీర్ణ వ్యవస్థ శరీరంలో అల్ప స్థాయి వాపును (ఇన్‌ఫ్లమేషన్‌) పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదల చక్రాన్ని దెబ్బతీసి, జుట్టు ముందుగానే విశ్రాంతి దశలోకి వెళ్లేలా చేస్తుంది. కొత్త జుట్టు పెరుగుదల తగ్గి, పాత జుట్టు రాలడం పెరుగుతుంది. ఈ సమస్యలను షాంపూలు లేదా ఆయిల్స్‌ ద్వారా పరిష్కరించడం సాధ్యం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రాంతీయ స్థాయి పరిశీలనలు
తెలంగాణ వినియోగదారుల పై త్రాయహెల్త్‌ సేకరించిన డేటా కూడా ఇదే పరిస్థితిని చూపిస్తోంది. జుట్టు రాలుదలతో వచ్చే పురుషుల్లో జీర్ణ సమస్యలు, పోషకాల శోషణలోపం, అసమయ జీర్ణ క్రియ, అంతర్గత వాపు లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడించింది.
త్రాయ హెల్త్‌ సహ వ్యవస్థాపకురాలు సలోని ఆనంద్‌ మాట్లాడుతూ…“తెలంగాణ గణాంకాలు నిర్లక్ష్యం చేయలేని హెచ్చరిక. ఇవి ఆరోగ్యస మస్యలతో బాధపడుతున్న వ్యక్తుల గణాంకాలు కావు; దేశంలోని అత్యంత చురుకైన నగరంలో పని చేస్తున్న వృత్తి పరులవి. కానీ అదే జీవనశైలి జీర్ణ వ్యవస్థను నెమ్మదిగా దెబ్బతీస్తోంది. జీర్ణ క్రియ దెబ్బతింటే మొదట కనిపించే ప్రభావం జుట్టు రాలుదల ”అని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : కొమొరిన్ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మధ్యప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *