Breaking News

ప్రజల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉంది… : బొండా రవితేజ

-బీసెంట్ రోడ్‌లో మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న బొండా రవితేజ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ బీ సెంట్ రోడ్ నందు మున్నా, సత్య, రవి, కిషోర్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో బొండా రవితేజ పాల్గొని అత్యంత రద్దీగా ఉండే బీ సెంట్ రోడ్‌లో కొనుగోలుదారులు, ప్రయాణికులు, కార్మికులకు స్వయంగా చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం అభిమానులు మరియు పార్టీ కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

ఈ సందర్భంగా బొండా రవితేజ మాట్లాడుతూ ప్రజల మధ్య ఉండటం, వారి ప్రేమాభిమానాలు పొందడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. నా జన్మదినోత్సవాన్ని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలతో నిర్వహించడం మరింత సంతృప్తిని కలిగిస్తోంది అని తెలిపారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని పేర్కొన్నారు. “రోజంతా కష్టపడి పనిచేసే కార్మికులు, వ్యాపారులు, ప్రయాణికులు తీవ్ర ఎండల్లో ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి వారికి చల్లని మజ్జిగ అందించడం ద్వారా కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం” అని అన్నారు.

అలాగే తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, హెల్మెట్ పంపిణీ, పుస్తకాల పంపిణీ, వృద్ధాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సేవ చేయడం ద్వారా వచ్చే ఆనందం ఎంతో గొప్పది, యువత సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుండి పాల్గొనాలి. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే సమాజంలో మంచి మార్పు వస్తుంది” అని బొండా రవితేజ  పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అభిమానులు, స్థానిక ప్రజలు మాట్లాడుతూ… ప్రజల మధ్యకు వచ్చి స్వయంగా మజ్జిగ పంపిణీ చేయడం బొండా రవితేజ సేవా దృక్పథానికి నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువత మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *