విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గంలోని పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొబైల్ మెడికల్ క్యాంపు రెండో రోజు కూడా కొనసాగింది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ క్యాంపులో 37, 53 డివిజన్ల ప్రజలు విశేషంగా వైద్య సహాయం పొందారు. వివిధ రకాల అనారోగ్యాలకు సంబంధించిన వైద్య పరీక్షలు, చికిత్స తో పాటు మందులు కూడా ఉచితంగా అంద చేశారు. ఈ క్యాంపులో వివిధ విభాగాల సీనియర్ వైద్యుల కన్సల్టేషన్ తో పాటు ఈసీజీ, ఎక్స్ రే, 2డీ ఎకో , తదితర పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. శంకర్ నేత్ర చికిత్సాలయ ఆధ్వర్యంలో కంటి పరీక్షలు నిర్వహించారు. పీవీఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ వారి మెడికల్ టీమ్ క్యాంప్ కు సహకరించారు. కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ ప్రతినిధులు కిరణ్, వెంకట రమణ, హరీష్ , ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, సుజనా మిత్ర లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News