Breaking News

కళాకారుల ఐక్యతే కళామాతల్లికి ఇష్టం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో కళాకారులంతా ఒక్కటిగా ఉంటేనే కళాకారుల కలలు సాధ్యమవుతాయని అదే కళామతల్లికి కూడా ఇష్టమని స్టార్స్ సిటీ 9 వ్యవస్థాపకులు గర్రె శివ రమేష్ తెలిపారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవ సందర్భంగా కళకు కలం తోడు నినాదంతో స్థాపించిన స్టార్స్ సిటీ 9 సకల కళాకారుల వేదిక వ్యవస్థాపకులు సీనియర్ జర్నలిస్ట్ గర్రె శివ రమేష్ (కామన్ మ్యాన్ రమేష్) ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ వన్ టౌన్ సాయిరాం థియేటర్ సందులోని ఒక ప్రైవేట్ కార్యాలయంలో సోమవారం కళాకారుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సినీ నిర్మాతలు నూతన దర్శకులు సినీ నటులు కెమెరా టెక్నీషియన్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ పాల్గొని రాబోయే రోజుల్లో సినీ కళా రంగం ఆంధ్రప్రదేశ్లో ఎలా అభివృద్ధి చెందాలో ప్రస్తుతం కళాకారులు పడుతున్న కష్ట నష్టాలను ఎలా ఎదుర్కోవాలో చర్చించుకుని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దానికి సంబంధించిన లోగోను ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఎన్టీఆర్ జిల్లా కో ఆర్డినేటర్ బి జయ కుమార్ గుప్తా , నాగోతి టాకీస్ వ్యవస్థాపకులు మరియు నిర్మాత నాగోతి సింహాచలం, 47 డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు సినీనటులు వెంపలి గౌరీ శంకర్ ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో నిర్ణయించుకున్న కళాకారుల భవిష్యత్తు ప్రణాళిక కళాకారులకు చాలా మేలు కలిగించి వారి కలలను నిజం చేసే విధంగా ఉందని ఈ పూర్తి వివరాలు త్వరలో రాష్ట్రంలోని అందరి కళాకారులకు తెలియజేయబడతాయని వారు తెలిపారు. ఈ సమావేశంలో క్షేత్ర టివి అధినేత గూడేల రాజన్న, సినీ నటులు వాండ్రాసి ఆనంద్ పాత్రుడు, నాగోతి శ్రీనివాసరావు (యన్. యస్. ఆర్), పి రమేష్ వర్మ, నూతన డైరెక్టర్ టి రామరాజు అసిస్టెంట్ డైరెక్టర్ ఆనంద్ హాస్యనటులు పి శివకుమార్ మరియు నగరాల కుల సంఘ నాయకులు జగుపిళ్ళ దుర్గా మహేష్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *