Breaking News

విద్యా ప్రణాళిక రూపొందించే షెడ్యూల్ వాయిదా వేయాలి – ఎస్.టి.యు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వచ్చే విద్యా సం॥నకు సంబంధించి పాఠశాల, ఆవాస ప్రాంత, క్లస్టర్, మండల స్థాయి విద్యా ప్రణాళికలను వెంటనే రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారని వేసవి దృష్ట్యా ఆ పనిని వచ్చే నెలకు వాయిదా వేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం, ఆం.ప్ర. (ఎస్‌టియు) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్.సాయి శ్రీనివాస్ సమగ్ర శిక్ష అధికారులను కోరారు.
మే 11వ తేదిన పాఠశాల స్థాయి, ఆవాస ప్రాంత ప్రణాళికలు రూపొందించాలని, 12వ తేది గ్రామ సభలు నిర్వహించాలని, 13వ తేది గ్రామ పంచాయితీలో ప్రణాళికలు ఆమోదింపచేసుకోవాలని, 14వ తేదిన క్లస్టర్ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని, 15వ తేదిన మండల స్థాయిలో విద్యా ప్రణాళిక రూపొందించాలని, 16వ తేదిన మండల స్థాయి రూపొందించిన పట్టికలను జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. డిశంబర్, జనవరి నెలల్లో రూపొందించవలసిన విద్యా ప్రణాళికలను నిర్లక్ష్యం చేసి వేసవి సెలవులు ప్రకటించాక చాలా మంది ఉపాధ్యాయులు వారి స్వంత గ్రామాలకు వెళ్ళడం, కొందరు వైద్య చికిత్సలకు వెళ్ళిన సమయంలో ఇప్పుడు హఠాత్తుగా 5 రోజులలో పూర్తి చేయాలని ఒత్తిడి చేయడం సరైనది కాదని, వెంటనే షెడ్యూల్ మార్చి వచ్చే నెలలో ప్రణాళికలు రూపొందించుటకు అవకాశం కల్పించాలని లేకపోతే ప్రక్రియలో పాల్గొనకుండా బహిష్కరిస్తామని ఎస్‌టియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *