అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయకిలాద్రి దివ్య క్షేత్రంపై అంగరంగ వైభవంగా జరుగుచున్న హనుమజ్జయంతి ఉత్సవాలలో భాగంగా సోమవారం విజయకిలాద్రిపై వేంచేసి ఉన్నటువంటి దాసాంజనేయ స్వామి వారికి అభిషేక మహోత్సవం శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎంతో వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమానికి తెలంగాణ BRS పార్టీ M.L. A శ్రీమాన్ హరీష్ రావు విజయ కిలాద్రి దివ్య క్షేత్రం పైకి విచ్చేసి శ్రీ స్వామివారి మంగళ శాసనాలు అందుకున్నారు. కొండ పైన ఉన్నటువంటి అన్ని ఆలయాలను దర్శించుకున్నారు. అనంతరం శ్రీ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో విజయ కీలాద్రి దివ్య క్షేత్ర హనుమత్ విజయ యాత్ర మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడ రథం సెంటర్ నుంచి సీతానగరం విజయకిలాద్రి దివ్య క్షేత్రం వరకు ఎంతో వైభవంగా బైక్ మరియు కార్ ర్యాలీ ఎంతో కోలాహాలంగా, కన్నుల పండుగగా జరిగినది. ఎంతోమంది భక్తులు ఈ యాత్రలో పాల్గొని శ్రీరామనామ స్మరణ చేస్తూ ఈ యాత్రను పూర్తి చేశారు. ఈ యాత్రలో పాల్గొన్న అందరికీ శ్రీ స్వామి వారు మంగళశాసనాలు అందించారు.
Prajavartha Online Telugu News