Breaking News

సమాజానికి ఉత్తమ పౌరులను అందిస్తున్న కూటమి ప్రభుత్వం

-రాష్ట్రానికి ఉపాధి కేంద్రంగా అమరావతి
-గొడ్డలి పట్టుకుని… రప్ఫా రప్ఫా అనే వారిని దూరంగా పెట్టి, విద్యారంగాన్ని ప్రొత్సహిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలి
-పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి సత్కరించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్, గద్దె అనురాధ, ప్రభుత్వ అధికారులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు చక్కటి విద్యను అందించి సమాజానికి ఉత్తమ పౌరులను అందించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. పదో తరగతి ఫలితాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాదిలో విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారంటే అది విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ తీసుకున్న సంకల్పం వల్లనేనని పేర్కొన్నారు.

ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులతో సోమవారం ఉదయం ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ర్యాలీ నిర్వహించారు. పటమటలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి ఆటోనగర్‌ బస్‌ టెర్నినల్‌ ఎదురుగా ఉన్న యార్లగడ్డ గ్రాండియర్‌ వరకు ఈ ర్యాలీ జరిగింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ సన్మానించి నగదు పురస్కారంతో సత్కరించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం టిడిపి అధ్యక్షులు గద్దె అనురాధ, యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ కూడా పాల్గొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మొదటి, రెండవ, మూడవ ర్యాంకులు సాధించిన 40 మందికి ఎమ్మెల్యే తన సొంత నిధుల నుండి నగదు బహుమతి అందజేశారు. మొదటి ర్యాంకు సాధించిన 13 మందికి రూ.7 వేలు చొప్పున, రెండవ ర్యాంకు సాధించిన 13 మందికి రూ.5 వేలు చొప్పున, మూడవ ర్యాంకు సాధించిన 14 మందికి రూ.3 వేలు చొప్పున మొత్తం రూ.1,98,000/- శాసనభ్యులు విద్యార్థినీ విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ సమాజానికి ఉత్తమ పౌరులను అందిచడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులు 2026వ సంవత్సరం పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులు అయ్యారంటే విద్యాశాఖా మంత్రి నారా లోకేష్‌ తీసుకున్న సంస్కరణల వల్లనేనని అభిప్రాయపడ్డారు. పదో తరగతి నుంచే విద్యార్థులకు మంచి ఫౌండేషన్‌ ద్వారా వారిని ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్ది సమాజానికి ఉన్నత పౌరులను అందిస్తున్నారని పేర్కొన్నారు. నారా లోకేష్‌ విద్యారంగంలో తనకున్న అనుభవంతో ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళికను అమలు చేశారని, దాని వల్లనే ఈ విధమైన ఫలితాలు సాధ్యమయ్యాయని వివరించారు. విద్యారంగాన్ని ప్రొత్సహిస్తూ, యువతకు ఉద్యోగాలు కల్పించే వారిని ప్రజలు ప్రొత్సహించాలని, అలా కాకుండా గొడ్డలి పట్టుకుని, రఫ్పా రప్ఫా అనే నినాదాలు చేసే నాయకులను ప్రజలు దూరంగా ఉంచాలని కోరారు. ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంకల్పం చేశారని, ఆయన సంకల్పం చేసిన ఏ అంశంలోనూ ఇప్పటి వరకు వెనుకడుగు వేయలేదన్నారు. యువతకు కంప్యూటర్‌ ద్వారా ఉద్యోగాల వస్తాయని పాతికేళ్ల నాడు గుర్తించి కంప్యూటర్‌ కోర్సులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంకల్పం చేశారని, ఫలితంగా ఇప్పుడు లక్షల సంఖ్యలో యువత కంప్యూటర్‌ ద్వారా ఉపాధి పొందుతున్నారు. రాబోయే పిల్లల భవిష్యత్తు కోసమే అమరావతి అని చెప్పారు. అమరావతి నగరం ఆంధ్రా రాష్ట్రనికి ఉపాధి కల్పించే నగరంగా మారుతుందన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పించే నగరంగా అమరావతి మారనుందని తెలిపారు. 25 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టీచర్‌ వ్యవస్థ దేశానికే దారి చూపించే వ్యవస్థ అని, అంత ప్రాధాన్యత ఉన్న వ్యవస్థలో పారదర్శకంగా తమ ప్రభుత్వం ఉపాధ్యాయుల నియమకాలు, బదిలీలు చేసిందని గుర్తు చేశారు.

తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాథ మాట్లాడుతూ మరికొంత మంది విద్యార్థుల్లో స్పూర్తిని కలిగించడానికి ఇలాంటీ కార్యక్రమాలు దోహదం చేస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్సీని ప్రకటించి పారదర్శకంగా 16 వేల టీచర్‌ పోస్టులను భర్తీ చేశారని పేర్కొన్నారు. పదో తరగతి ఫలితాలు వచ్చిన తర్వాత పత్రికల్లో ప్రవేటు పాఠశాలకు చెందిన విద్యార్థుల ఫోటోలతో ప్రకటనలు చూస్తూ ఉంటామని, కాని ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులతో ప్రకటనలు చూస్తున్నామని చెప్పారు. సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా ఇంకా కష్టపడి చదవాలని విద్యార్థులకు గద్దె అనురాధ సూచించారు.

యువనేత గద్దె క్రాంతికుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని మరికొంత మంది ఉత్తమ మార్కులు సాధించడానికి ప్రయత్నిస్తారనే ఉద్దేశ్యంతో ఈ ర్యాలీని, విద్యార్థులకు సత్కారం, నగదు పురస్కారం లాంటవి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలపై ప్రజలకు విశ్వాసం కల్పించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ జల్లా డీఈవో చంద్రకళ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి పిల్లలకు సిలబస్‌ను ముందుగానే పూర్తి చేసి, విద్యా శాఖ మంత్రివర్యలు ఆదేశాల ప్రకారం వంద రోజుల ప్రణాళికను అమలు చేయడం వల్లనే ఈ విధమైన ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టి సౌకర్యాలు కల్పించారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చించి ప్రోత్సహించాల్సిందిగా తల్లిదండ్రులను ఆమె కోరారు.

విద్యార్థిని దివ్య మాట్లాడుతూ తాము చదివే పాఠశాలల్లో వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ను అమలుతోపాటుగా ఉపాధ్యాయుల ప్రోత్సహంతోనే ఈ ఫలితాలు సాధించగలిగినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అన్ని డివిజన్ల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఎ.ఇ.ఒ.లు, వారి సిబ్బంది, కూటమి పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *