Breaking News

మొగల్రాజపురం రెవిన్యూ పరిధిలోని సర్వే నెం. 1 / 1 ఎ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లకై సిపిఐ పోరాటం!

-నీటి మూటలుగా మారిన కూటమి 2 సెంట్ల ఇళ్ల స్థలం ఎన్నికల హామీ!!
-ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కి కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి అభ్యంతరాలను వెనక్కి తీసుకోవాలి!!!

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొగల్రాజపురం రెవిన్యూ పరిధిలోని సర్వే నెం.1 / 1 ఎ లో ఇచ్చిన ఇళ్ల పట్టాలను పూర్తి హక్కులతో రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ భారత కమ్యూనిస్టు పార్టీ,విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శివర్గ సభ్యులు అప్పరబోతు రాము అధ్యక్షతన ఈ రోజు మొగల్రాజపురం లోని నివాసితులు మొగల్రాజపురం బోయపాటి మాధవరావు గ్రంధాలయం నుండి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయమునకు ప్రదర్శనగా వెళ్లి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భముగా మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్,నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు నేతృత్వంలోని సిపిఐ ప్రతినిధి బృందం కలెక్టర్ గారిని కలసి సమస్యను వివరించడం జరిగింది.

మాజీ ఎమ్మెల్సీ, మాజీ కార్పొరేటర్ జల్లివిల్సన్ ఈ సందర్భముగా మాట్లాడుతూ మొగల్రాజపురం రెవిన్యూ పరిధిలో ఉన్న సర్వే నెం. 1 /1 A లో గతంలో స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిషు వారు ఇచ్చిన బి-ఫారాలు,గాని, స్వాతంత్ర్యం అనంతరం వివిధ సందర్భాలలో ఇళ్ళు లేని పేదలకు నివాసాలు కల్పించాలని కమ్యూనిస్టులు చేసిన కృషి మూలంగా అనేక మందికి పేద మధ్యతరగతి ప్రజలు ఇళ్ల స్థలాలను కేటాయిస్తూ పట్టాలను కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ప్రజలు అందులో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తూ నగర పాలక సంస్థకు ఎప్పటికప్పుడు ఇంటి పన్నులు, నీటి పన్నులు తదితర పన్నులను చెల్లిస్తున్నారు.ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ప్రజాప్రతినిదులు ముఖ్యంగా కమ్యూనిస్టులు ప్రజా ప్రతినిధులుగా ఉన్నపుడు ఈ ప్రాంతంలో నివాసితులు మంచి నీటివసతి, డ్రైనేజి,కరెంటు వంటి అనేక మౌలిక వసతులు కల్పించడం జరిగింది అని తెలియచేశారు.ఈ ప్రాంత నివాసితులు వారి నివాసాలకు వారికీ పూర్తి హక్కులు కలిపిస్తూ నేటి వరకు వారికీ ఇళ్ల రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో వారి కుటుంబ అవసరాలైన విద్య,వైద్యం, వివాహం వంటి సందర్భాలలో వారి ఇళ్ళు కుదువ పెట్టి వారి ఆర్థిక అవసరాలు తీర్చుకోలేని పరిస్థితిలో ఈ ప్రాంత నివాసితులు అనేక ఏళ్లుగా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని అన్నారు. మొగల్రాజపురం పరిసర ప్రాంతాలలో కేంద్ర పురావస్తు శాఖ వారి ఆద్వర్యంలోని గుహల పరిరక్షణ పేరుతో ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కు అభ్యంతరాలను పెట్టడం తదనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ను నిలుపుదల చేయడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీగా తీవ్రముగా ఖండిస్తున్నామని,అలాగే గ్రామకంఠం పేరుతో మైదాన ప్రాంతం లోని స్థలాలను ఎవరి స్వాధీనంలో ఉంటె వారికీ పూర్తి హక్కులను కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ ఈ రోజు జిల్లా కలెక్టర్ గారిని కలసి సమస్యను వివరించి నివాసితులు తరపున వినతి పత్రం అందచేయటం జరిగిందని దానికి కలెక్టర్ గారు స్పందించి సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేయడం జరుతుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామాలలో 3 సెంట్లు,పట్టణాలలో 2 సెంట్ల ఇళ్ల స్థలం అలాగే ఇళ్ల నిర్మాణమునకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ దిశగా ఎటువంటి కార్యాచరణ చేపట్టక పోవడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమే అని ఎద్దేవా చేసారు. ప్రభుత్వం ఇళ్ళు లేని ప్రజలకు ఇళ్ళు ఇవ్వకపోగా ఇప్పటికే గత ప్రభుత్వాల కాలంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను కూడా పూర్తి హక్కులతో రిజిస్ట్రేషన్ చేపట్టకపోవడం ఎంత వరకు సమంజసమో ప్రభుత్వ పెద్దలు సమాధానం చేపట్టాలని డిమాండ్ చేసారు.మొగల్రాజపురం రెవెన్యూ పరిధిలోని ఇళ్లను పట్టాదారులకు నామమాత్రపు ధరకు పూర్తి హక్కులతో రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణమే ఇళ్ల రిజిస్ట్రేషన్ కు శాశ్వత పరిష్కారం చూపాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిపిఐ గా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, స్థానిక డివిజన్ కార్యదర్సులు పడాల కనకరరావు,పూసర్ల లక్ష్మణరావు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *