జన గణనను వేగవంతం చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జన గణనను వేగవంతం చేయాలని చీఫ్ సెన్సెస్ ఆఫీసర్ మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం భవానీపురం, నాలుగు స్తంభాల సెంటర్, కబేళా, సితార సెంటర్ ప్రాంతాలన్నీ పర్యటించి ఎన్యుమేరేటర్లు మరియు సూపర్వైజర్లతో చేసే జన గణన ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారితో పాటు స్వయంగా తానే ఒక కుటుంబంతో మాట్లాడి, ప్రశ్నలన్నింటినీ అడిగి, జనగణన ప్రక్రియను పూర్తి చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జన గణన దేశ అభివృద్ధి ప్రణాళికలకు, సంక్షేమ పథకాల అమలుకు ఎంతో కీలకమైన ప్రక్రియ అని తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి సరైన వివరాలను సేకరించాలని, ప్రజలకు జనగణన ప్రాముఖ్యతను వివరించి సహకారం పొందాలని సూచించారు. ఎన్యుమేరేటర్లు కేటాయించిన ప్రాంతాలలో వేగవంతంగా సర్వే పూర్తి చేయడంతో పాటు, సేకరించిన వివరాల్లో ఖచ్చితత్వం పాటించాలని సూచించారు. జనగణనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా సూపర్వైజర్లు నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి అవసరమైన గణాంకాల సేకరణలో జనగణన అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రక్రియ కావడంతో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, సూపర్వైజర్లు జోష్నా నాగశ్రీ, రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *