-కలెక్టర్ కి ఏఐటియుసి విజ్ఞప్తి
-మాచవరం వద్దనున్న మలేరియా కార్యాలయం వద్ద జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతున్న విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్దె రాజా, అధ్యక్షులు ఎస్వీఎస్ చలం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంజనీరింగ్, పార్కు కార్మికుల జీతాల పెంపుదల కోసం వారికి సంఘీభావంగా 11 రోజులపాటు పారిశుధ్య, ఇంజనీరింగ్, పార్కు కార్మికులు చేసిన సమ్మె కాలానికి జీతాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఉన్నదని, నగరపాలక సంస్థ అధికారులు తక్షణం స్పందించి జీతాలు చెల్లించాలని నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా కలెక్టర్ గారికి విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బుద్దె రాజా, అధ్యక్షులు ఎస్వీఎస్ చలం విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఉదయం మాచవరం సర్కిల్ -6 మలేరియా కార్యాలయం వద్ద జరిగిన కారణాల మీటింగులో వారు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లిస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం నేటి వరకు అమలు చేయలేదని, చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్నారని అన్నారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులలోనూ నిబద్ధతగా పారిశుధ్య పనులు నిర్వహిస్తున్న కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.
Prajavartha Online Telugu News