Breaking News

అభివృద్ధి పనులను పూర్తి చేసేలా రోజువారీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పరిధిలోని బిఆర్ స్టేడియంలో మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను ఆగస్ట్ చివరికి పూర్తి చేసేలా రోజువారీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. గురువారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో బిఆర్ స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారులు, జిఎంసి ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్ల ప్రతినిధులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత స్టేడియంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ, బిఆర్ స్టేడియం పనుల వేగవంతంకు క్షేత్ర స్థాయిలో ఏ సమస్య లేనందున కాంట్రాక్టర్ తగిన కార్మికులు, సిబ్బందిని సిద్దం చేసుకొని వేగంగా చేయాలని, జిఎంసి నుండి పర్యవేక్షణకై ఈఈ, డిఈఈ, ఏఈలకు విధులు కేటాయించామన్నారు. అభివృద్ధి పనులు నిర్దేశిత డిజైన్ మేరకు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ఆగస్ట్ చివరికి పూర్తి అయ్యేలా డిఎస్డీఓ, జిఎంసి అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. పనుల పురోగతిపై రోజువారీ సమీక్ష చేసి, తమకు నివేదిక ఇవ్వాలని ఈఈని ఆదేశించారు.
సమావేశంలో జిఎంసి ఈఈ విష్ణు, డిఈఈ శ్రీనివాస్, క్రీడా ప్రాధికారిక సంస్థ అధికారులు, కాంట్రాక్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *