Breaking News

అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి శుక్రవారం ఉదయం సితార గ్రౌండ్స్, విద్యాధరపురంలో ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి సిబ్బంది.

ఈ కార్యక్రమంలో అగ్ని ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన నిరోధక చర్యలు, అగ్ని ప్రమాద నిరోధక పరికరాలను ఉపయోగించు విధానము, అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటలను ఎలా అర్పాలి, ఎటువంటి పరికరాలను ఉపయోగించాలి, ఫైర్ స్ప్రింక్లర్స్, స్మోక్ డిటెక్టర్స్, ఎక్కడెక్కడ అమర్చాలి, వాటి వలన స్మోక్ అలారం ఎలా వస్తుంది, అగ్ని ప్రమాదం జరగకుండా గ్రౌండ్ చుట్టూ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏమేం ఉండాలి వంటి విషయాలపై వారికి అవగాహన కల్పించారు. స్టాల్స్ వద్ద గ్యాస్ సిలిండర్ వంట సామాగ్రి పెట్టి వంటరాదని, కామన్ కిచెన్ లోనే వంట చేసుకోవాలని, ఎటువంటి అగ్ని ప్రమాదం జరగకుండా ఖచ్చితంగా అగ్నిమాపక చర్యలు పాటించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో రీజినల్ ఫైర్ ఆఫీసర్ మల్యాద్రి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *