Breaking News

నేటి జలధార.. రేపటి జీవనాధార..

– రుద్రవరం పెద్ద చెరువులో ముమ్మరంగా పునరుద్ధరణ పనులు
– అన్నదాతలకు సాగునీటి భరోసా కల్పించేలా ముందస్తు కార్యాచరణ
– రూ. 9,61,206 వ్యయ అంచనాలతో నీటి సంరక్షణ చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముందస్తు కార్యాచరణే అభివృద్ధికి పునాది.. నేటి జాగ్రత్త.. రేపటి సురక్షిత భవిష్యత్! అందుకే దార్శ‌నిక ముఖ్య‌మంత్రి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన జ‌ల‌ధార‌.. జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మం ఎన్‌టీఆర్ జిల్లాలో విజ‌య‌వంతంగా ముందుకెళ్తోంది. నేటి నీటి సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు.. భ‌విష్య‌త్తులో సిరిసంప‌ద‌ల‌కు నెల‌వుల‌నే దాన్ని నిజం చేసేలా రెడ్డిగూడెం మండ‌లం, రుద్ర‌వ‌రం గ్రామంలోని పెద్ద చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు జోరుగా సాగుతున్నాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో చేప‌ట్టిన ఈ ప‌నులపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.
నీటి నిల్వ సామ‌ర్థ్యం పెంపు:
పెద్ద చెరువులో మట్టిని తొలగించడం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, కాల్వల శుభ్రపరిచే పనులు, బండబయళ్లు బలోపేతం చేయడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు జ‌రుగుతున్నాయి. ఈ పనుల ద్వారా వర్షాకాలంలో అధికంగా నీటిని నిల్వ ఉంచే అవకాశం కలుగుతుంది. ఈ చెరువుకు సంబంధించి రూ. 9,61,206 వ్యయ అంచనాలతో నీటి సంరక్షణ చర్యలు జ‌రుగుతున్నాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన రుద్రవరం రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా, మ‌రింత సాగుకు ఊత‌మిచ్చేలా ఈ చ‌ర్య‌లు అక్క‌ర‌కొస్తాయి.
ముంపును తొల‌గించి మురిపించి:
ఇప్ప‌టివ‌ర‌కు పేరుకు పెద్ద చెరువే కానీ.. పూడిక‌తో పాటు గ‌ట్టు బ‌ల‌హీన‌త వ‌ల్ల ఇబ్బందులు త‌లెత్తేవి. వ‌ర్షాకాలంలో కొద్దిపాటి నీటికే చెరువు నిండి పొంగిపొర్లి ముంపు ప‌రిస్థితి త‌లెత్తేది. ఈ నేప‌థ్యంలో ఈ చెరువుకు కొత్త జీవం పోసేందుకు జ‌ల‌ధార‌-జ‌ల‌హార‌తి కార్య‌క్ర‌మం కింద శ్రీకారం చుట్టారు. పూడిక తీత వ‌ల్ల నీటి నిల్వ సామ‌ర్థ్యం పెరిగేలా చేస్తున్నారు. అదేవిధంగా బ‌ల‌హీనంగా ఉన్న గ‌ట్ల‌ను ప‌టిష్టం చేయ‌డం వ‌ల్ల గ‌తంకంటే మిన్న‌గా వ‌చ్చే వ‌ర్షాకాలంలో ఈ చెరువుకు కొత్త క‌ళ రానుంద‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు. రుద్ర‌వరంలో దాదాపు 540 రైతు కుటుంబాలు ఉన్నాయి. వ‌రితో పాటు ప‌త్తి, మొక్క‌జొన్న‌, మామిడి వంటి పంట‌ల‌ను సాగుచేస్తున్నారు. ప్ర‌ధానంగా ఎన్ఎస్‌పీ కెనాల్‌ను స‌ద్వినియోగం చేసుకుంటూ పంట‌లు సాగుచేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి చెరువుల‌కు కొత్త జీవం రావ‌డం వ‌ల్ల సాగుకు మ‌రింత ఊతం దొరుకుతుంది. పాడిపంట‌ల‌తో పాటు ప‌శుపోష‌ణ‌కు అక్క‌ర‌కొస్తుంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *