– జక్కంపూడి టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శుక్రవారం జక్కంపూడి టిడ్కో గృహ నిర్మాణ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కార్మికుల సంఖ్య, నిర్మాణ పనుల పురోగతి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పనులను మరింత వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అనంతరం వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ) ప్రాంతాన్ని కూడా సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి జక్కంపూడి గృహ నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. జక్కంపూడిలో మొత్తం 6,576 గృహాల నిర్మాణం చేపట్టగా, 2026, మార్చి నెలలో 2,256 గృహాలను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. మిగిలిన 4,320 గృహాల నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, వీటిలో 3,000 గృహాలను జూన్ నెలలో లబ్ధిదారులకు అందజేయడానికి కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఇన్‌ఫ్రా, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, గొల్లపూడి వద్ద నిర్మిస్తున్న ఇంటేక్ వెల్ పనుల పురోగతిని కూడా కలెక్టర్ లక్ష్మీశ సమీక్షించారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో ఫీల్డ్ సిబ్బంది, ఏజెన్సీల సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News