-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత్ టెక్స్ -2026 ఈవెంట్ లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మొదటి రోజు బిజీగా గడిపారు. పలువురు జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల రాకకు, పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని, ఇన్వెస్టర్లకు ఫ్రెండీ ప్రభుత్వమని తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామంటూ, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి సవిత కోరారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాల కొనుగోలుకు సంబంధించి పలు ఆర్డర్లు సైతం చేనేత, జౌళి శాఖకు వచ్చాయి. ఈ నెల 14 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అతిపెద్ద అంతర్జాతీయ టెక్స్‌టైల్ ప్రదర్శన భారత్ టెక్స్ -2026 ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ టెక్స్ ఈవెంట్లో రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తుల అమ్మకాలే లక్ష్యంగా మంత్రి సవిత రెండ్రోజుల పర్యటనకు గురువారం ఢిల్లీ చేరుకున్నారు. మొదటి రోజు పలువురు జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాత గాంచిన వివిధ ప్రాంతాల చేనేత వస్త్రాల ప్రాముఖ్యత తో పాటు ఆయా వస్త్రాల తయారీలో కలంకారీ నైపుణ్యం వినియోగంపైనా వారికి వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పెట్టుబడుల స్థాపనకు సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత వివరించారు. దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతానికి పైగా ఏపీకే తరలొస్తున్నాయన్నారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం నెలకొల్పేలా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ అండగా ఉంటున్నారన్నారు. తమది ఇన్వెస్టర్లకు ఫ్రెండ్లీ ప్రభుత్వమని మంత్రి సవిత స్పష్టంచేశారు.
చేనేత ఉత్పత్తుల కొనుగోలు ఆసక్తి
భారత్ టెక్స్ 2026లో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ కు విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత ఉత్పత్తుల కొనుగోలుకు పలువురు జాతీయ, అంతర్జాతీయ కొనుగోలుదారులు ఆసక్తి చూపారు. ముఖ్యంగా చేనేత వస్త్రాలపై కలంకారీ చీరలు, ఇతర ఉత్పత్తులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
మంత్రి సవిత వరుస భేటీలు
భారతదేశ అతిపెద్ద అంతర్జాతీయ టెక్స్‌టైల్ ప్రదర్శనకు విచ్చేసిన మంత్రి సవిత పలువురు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులతో భేటీ అయ్యారు. అరవింద్ ఫ్యాబ్రిక్ సీఈవో డాక్టర్ పరమ్ షా, భారత్ టెక్స్ 2026 ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నరేన్ గోయోంకాతో పలు అంశాలపై చర్చించారు. వారితో పలువురు విదేశీ కొనుగోలుదారులతోనూ చర్చలు జరిపారు. రెండోరోజు శుక్రవారం కూడా మంత్రి సవిత భారత్ టెక్స్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు. సాయంత్రం ఢిల్లీలో ఆధునీకరించిన లేపాక్షి షో రూమ్ ను మంత్రి సవిత ప్రారంభించనున్నారు. అంతకు ముందు ఢిల్లీ పర్యటనకు వచ్చిన మంత్రి సవితకు కేంద్ర హ్యాండ్ల్యూమ్ ఎక్స్ పోర్ట్ ప్రోమోషనల్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్.శ్రీధర్, ఏపీహెచ్డీసీ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాదరావు, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషన
Prajavartha Online Telugu News