Breaking News

ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు నేడు మంత్రుల బృందం సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు 22వ తేది బుధవారం ఉదయం 11.30గం.లకు ఎపి సచివాలయం 5వ భవనంలోని కలక్టర్ల సమావేశ హాల్లో 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల బృందం సమావేశం జరగనుంది. రాష్ట్ర ఆర్ధిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసన సభా వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్,రాష్ట్ర వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యాశాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్,రాష్ట్ర రెవెన్యూ,రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ లతో కూడిన ఈ మంత్రుల బృందం సమావేశంలో గుర్తింపు పొందిన 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు. అదేవిధంగా 10 ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈసమావేశంలో పాల్గోనున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *