విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం ఉదయము 10.00 గంటల నుండి మధ్యాహ్నం 03.00 గంటల వరకు జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయము, ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్, విజయవాడ నందు సంచాలకులు, సైనిక సంక్షేమ శాఖ, విజయవాడ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయవాడ మరియు ఆంధ్రా హాస్పిటల్, విజయవాడ వారి ఆద్వర్యములో ఉచిత వైద్య శిబిరము (మెడికల్ క్యాంప్) విజయవంతంగా నిర్వహించబడినధి. ఈ ఉచిత వైద్య శిబిరములో బి.పి., షుగర్, 2డి ఏకొ, కె.యు.బి, డెంటల్, ఆప్తమాలజీ మరియు ఇ.ఎన్.టి పరీక్షలు నిర్వహించబడినవి. ఈ వైద్య శిబిరములో 123 మంది మాజీ సైనికులు మరియు వారి కుటుంబ సబ్యులు హాజరై అందు బాటులో ఉన్న అన్ని సేవలను వినియోగించుకొన్నారు. ఈ కార్యక్రమములో వై. శ్రీకాంత్, డి.జి.యం., యూనియన్ బ్యాంక్ రీజనల్ కార్యాలయము, విజయవాడ వారు, బి. శ్యామ్ ప్రసాద్, ఏ.జి.యం., యూనియన్ బ్యాంక్ జోనల్ కార్యాలయము, విజయవాడ వారు, కెప్టెన్. డాక్టర్. పి. సత్య ప్రసాద్, సంచాలకులు, సైనిక సంక్షేమ శాఖ, ఆంద్ర ప్రదేశ్, విజయవాడ వారు, ఫ్లైట్ లెఫ్టినెంట్. బాలాజీ, కల్నల్. ఎస్. ఎన్. రావు, ఆంధ్ర హాస్పిటల్ వైద్య సిబ్బంది, వై. ఈశ్వర రావు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి, విజయవాడ వారు మరియి కార్యాలయ సిబ్బంధి ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. ఈ కార్యక్రమము విజయవంతమైనందుకు సహకరించిన యూనియన్ బ్యాంక్ అధికారులు మరియు సిబ్బంధి, ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు మరియు సిబ్బందికి వై. ఈశ్వర రావు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి, విజయవాడ వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
Tags vijayawada
Check Also
వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం
-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …
Prajavartha Online Telugu News