విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టీఆర్ జిల్లాలో యూరియా మరియు డీఏపీ ఎరువుల పంపిణీ APAIMS యాప్ ద్వారా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతోంది. రైతుల ప్రస్తుత అవసరాలను తీర్చేందుకు జిల్లాలో తగినంత ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎరువుల నిల్వలు క్రింది విధంగా ఉన్నాయి:
యూరియా
– పీఏసీఎస్ (PACS)ల వద్ద: 3,574 మెట్రిక్ టన్నులు
– ప్రైవేట్ ఎరువుల విక్రేతల వద్ద: 5,059 మెట్రిక్ టన్నులు
డీఏపీ
– పీఏసీఎస్ (PACS)ల వద్ద: 587 మెట్రిక్ టన్నులు
– ప్రైవేట్ ఎరువుల విక్రేతల వద్ద: 493 మెట్రిక్ టన్నులు
జిల్లాలో యూరియా మరియు డీఏపీ ఎరువుల కొరత లేదని, రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేయడమైనది.
ఎరువుల విక్రయాలకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు లేదా సమస్యలు ఉంటే కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 9154970454 ను సంప్రదించి తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు.
Prajavartha Online Telugu News