విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్- టీచర్ మీట్ 4.0 కు విశేష స్పందన లభించింది. రామ రాజ్య నగర్ లోని జీ ఎన్ ఆర్ ఎం సీ ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించి పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యమైన తల్లితండ్రులను అభినందించారు. గత ఏడాది పది ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ సోమశేఖర్ నాయక్,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మానవత ఆర్గనైజేషన్ హానరరీ ప్రెసిడెంట్ వేమూరి బాబురావు, లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ గెలాక్సీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నారిండి కిషోర్, రోటరీ క్లబ్ ప్రోగ్రాం ఇన్చార్జ్ దేసు ధర్మేంద్ర బాబు, యస్ ఎం సి స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ఏం పవన్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎం ఈ ఓ సోమశేఖర్ నాయక్, ప్రధానోపాధ్యాయులు వీ వీ రవి కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో పేరెంట్స్ ను భాగస్వాములు చేస్తూ కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్ మీట్ ను నిర్వహించడం హర్షణీయమన్నారు.
జిఎన్ ఆర్ ఎంసి హైస్కూల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలను మెరుగుపరుస్తున్నామని ప్రతి యేటా విద్యార్థుల శాతం కూడా పెరుగుతుందన్నారు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి “సుజనా ఫౌండేషన్” “సీడ్స్ ఇంపాక్ట్ ఫౌండేషన్” ల ద్వారా పాఠశాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యే సుజనా చౌదరి రూ 48 లక్షల తో ఐ .ఓ .టీ లాబ్ , మరియు లైబ్రరీ ఏర్పాటు చేసి కార్పొరేట్ స్థాయి డిజిటల్ విద్యను జి ఎన్ ఆర్ ఎంసి హైస్కూల్ విద్యార్థులకు అందిస్తున్నారన్నారు. మెగా పేరెంట్ టీచర్ మీట్ 4.0 ను విజయవంతం చేసిన ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News