విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వన్ టౌన్ గాంధీజీ హైస్కూల్ లో మెగా పేరెంట్ – టీచర్ మీట్ ( పీ టీ ఎం) 4.0 ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ సోమశేఖర్ నాయక్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఉపాద్యాయులు, విద్యార్ధుల తల్లి తండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎం ఈ ఓ సోమశేఖర్ నాయక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెగా పీ టీ ఎం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి , ఉపాధ్యాయుల మరియు తల్లితండ్రుల మధ్య సమన్వయం పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమలో విద్య, వైద్య రంగాల బలోపేతంగా లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. సుజనా ఫౌండేషన్ ద్వారా త్వరలో గాంధీజీ హైస్కూల్ లో (ఐ ఓ టీ) లాబ్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు.
ప్రధానోపాధ్యాయులు కందుల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్ మీట్ 4.0 కి విద్యార్థుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించామన్నారు. విద్యార్థుల ప్రగతి , హాజరు మరియు విద్యా ప్రమాణాలపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులందరం చర్చించామని తెలిపారు. గాంధీజీ హైస్కూల్లో ప్రతి యేటా విద్యార్థుల ఉత్తీర్ణతతో పాటు వారి సంఖ్య కూడా పెరుగుతుందన్నారు.. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గాంధీజీ హైస్కూల్ విద్యార్థులు పోటీ పడుతున్నారని ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కందుల మల్లికార్జున రెడ్డి తెలిపారు.
విద్యా కమిటీ చైర్మన్ బేగం, పాఠశాల పూర్వ విద్యార్థులు , విద్యార్థుల తల్లిదండ్రులు , విద్యార్థులు పాల్గొని మెగా పేరెంట్ టీచర్ మీట్ ను విజయవంతం చేశారు.
Prajavartha Online Telugu News