విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ఎన్డీయే కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు. 41 వ డివిజన్, సౌత్ కరకట్టకు చెందిన టీ సవురమ్మ (66) హృద్రోగం తో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు మరింత మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలపడంతో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన రూ7 లక్షల 47 వేల విలువైన ఎల్ ఓ సీ ను బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
త్వరితగతిన స్పందించి ఎల్ ఓ సీ ను అందజేసిన ఎమ్మెల్యే సుజనా చౌదరి కు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య, కూటమి నేతలు మైలవరపు కృష్ణ, నున్న కృష్ణ, పెటేటి రాజా మోహన్, కాంత రావు, లక్ష్మీ సలోని, యర్రంశెట్టి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News