Breaking News

శ్రీ మహాచండీదేవి అలంకారంలో కనకదుర్గమ్మవారి దర్శనం

-ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక పూజలు, చండీ శ్లోక పఠనం…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆదిశక్తి స్వరూపిణిగా, దుష్టశక్తుల సంహారిణిగా మహాచండీదేవిని ఆరాధించడం ద్వారా ధైర్యం, శాంతి, శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు.

భక్తులు అమ్మవారికి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు సమర్పించి, కుటుంబ క్షేమం, ఆరోగ్యం, ఐశ్వర్యం, లోకకల్యాణం కోసం ప్రార్థిస్తున్నారు. “ఓం శ్రీ మహాచండికాయై నమః” అనే నామాన్ని జపిస్తూ పుష్పార్చన చేసి, నైవేద్యం సమర్పించి హారతి ఇస్తున్నారు.

ఈ సందర్భంగా భక్తులు చండీ శ్లోకాలను పఠిస్తారు.

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే।
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే॥

*“ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చేll*
అనే చండీ మంత్రాన్ని జపిస్తున్నారు. మహాచండీదేవి ఆరాధన శక్తి, ధైర్యం, ధర్మంపై విశ్వాసాన్ని పెంపొందిస్తుందని భక్తుల విశ్వాసం.
అమ్మవారి కృపతో ప్రజలకు సుఖశాంతులు, సౌభాగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఏపీ-తమిళనాడు ముఖ్యమంత్రులు చంద్రబాబు-విజయ్ భేటీ

-గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చ -చెన్నై తాగునీటి అవసరాలు తీర్చాలని కోరిన తమిళనాడు సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: …