Breaking News

జనసేన ‘కౌలు రైతు భరోసా యాత్ర’కు ఎన్.ఆర్.ఐ. జనసేన ఆస్ట్రేలియా బృందం విరాళం

-పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి రూ. 25 లక్షల చెక్ అందించిన ఎన్.ఆర్.ఐ ప్రతినిధులు

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజా వార్త :
జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కౌలు రైతు భరోసా యాత్ర’కు ఎన్.ఆర్.ఐ. జనసేన ఆస్ట్రేలియా బృందం రూ. 25 లక్షలు విరాళం అందించింది. ఈ మొత్తాన్ని ఎన్.ఆర్.ఐ. బృందం ప్రతినిధులు హైదరాబాద్ పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ని బుధవారం కలిసి అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “అన్నం పెట్టే రైతన్నలను ఆదుకోవాలన్న సదుద్దేశంతో మీరు అందించిన ఈ సాయానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరిచ్చిన ఈ డబ్బు రైతు కుటుంబాలకు చేరేలా, వారి పిల్లలు చదువులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై మీరిచ్చిన సలహాలు నా దృష్టిలో ఉన్నాయి. మీ ఆహ్వానం మేరకు త్వరలోనే సరైన సమయంలో ఆస్ట్రేలియాలో పర్యటిస్తాన”ని చెప్పారు ఈ బృందంలో పప్పుల జ్ఞానేశ్వర రావు, వఝుల పవన్ కిశోర్, గాజుల మురహరి, పులిపాటి రామ్, సింగంశెట్టి పవన్ కుమార్ తదితరులు ఉన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి

-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *