-తెదేపా నేత ఎం. ఎస్. బేగ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మూడున్నరేళ్ళగా అధికారాన్ని కొనసాగిస్తూనే స్కీముల పేరుతో స్కాంలు చేస్తోన్నజగన్ సర్కారు గర్జన పేరుతో సరికొత్త నాటకానికి తెరదీసారని తెదేపా రాష్ట్ర సీనియర్ నేత ఎం.ఎస్.బేగ్ మండిపడ్డారు. అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం ఇలా గర్జనల పేరిట గర్జించటం దేశ చరిత్రలో ఎక్కడా లేదని ఈ సందర్భంగా ఉదహరించారు. బేగ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ వై.సి.పి. నిర్వహిస్తోన్న బి.సి. గర్జన మతాలు, కులాల నడుమ చిచ్చుని ఎక్కడ రాజేస్తుందా ? అనే భయాందోళనలు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు. రాష్ట్రంలో 54 శాతం ఉన్న బి.సి.లకు అడుగడుగునా అన్యాయమే జరుగుతోంది. బి.సి.ల అభ్యున్నతి కోసం వెచ్చించాల్సిన 34 వేల కోట్ల రూపాయల సబ్ ప్లాన్ నిధులను జగన్ సర్కారు దారి మళ్ళించడం ద్రోహం కాదా ? అని నిలదీసారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లుకు కోతపెట్టి 17 వేల మంది బి.సి.లకు రాజకీయ కొలువులు దూరం చేయడం దగా కాదా? అని ప్రశ్నించారు. వెయ్యికి పైగా నామినేటెడ్ పదవుల్లో 5 శాతం కూడా
బి.సి.లు లేకుండా మొత్తం తన సామాజిక వర్గంతో నింపడం అణిచివేయడం కాదా? అని ప్రశ్నిస్తున్నాను. ఈ సర్కారులో బి.సి. ఎమ్మెల్యేలుగా ఉన్న 90 శాతం మందికి తాడేపల్లి ప్యాలెస్ ప్రవేశం లేదన్నది వాస్తవం కాదా? అని నిలదీసారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి భూదందాలు, రాయలసీమలో పెద్దిరెడ్డి ఆగడాలకు, రాజ్యాంగేతర శక్తిగా ఉన్న సజ్జల స్కెచ్ వేధింపులకు ప్రాణాలు విడుస్తోంది బి.సి.లు కాదా ? అని ప్రశ్నించారు. బి.సి.లు ఇలా అణచివేత నిలువు దోపిడీకి గురవుతుంటే… జగన్ సర్కారు మసిపూసి మారేడుకాయ చేసేందుకు గర్జనల పేరుతో గర్జించడం ఎవరిని మోసగించడానికని నిప్పులు చెరిగారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రనికి” కార్యక్రమానికి వస్తోన్న అపూర్వ స్పందనను జీర్ణించుకోలేని జగన్ గర్జన.
Prajavartha Online Telugu News