Breaking News

ఆరోగ్యాంధ్రప్రదేశ్ లక్ష్యంగా “మణిపాల్ గుడ్ హెల్త్ రన్ – 5కె & 10కె”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్న మణిపాల్ హాస్పిటల్ మరో ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నెల 11 వ తేదీన “మణిపాల్ గుడ్ హెల్త్ రన్ – 5కె & 10కె” పేరుతో దీనిని విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్డులో మణిపాల్ హాస్పిటల్ నిర్వహించనుంది. అయితే దీనికి సంబంధించిన టీ-షర్ట్ ను ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీ రావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి, ఇతర డాక్టర్ల బృందం పాల్గొన్నారు. ఇలాంటి హెల్త్ రన్ ను సంస్థ రెండో సారి (సెకండ్ ఎడిషన్) నిర్వహిస్తుంది.

ఈ సందర్భంగా ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీ రావు “మణిపాల్ గుడ్ హెల్త్ రన్ – 5కె & 10కె” పై మాట్లాడారు. “మణిపాల్ హాస్పిటల్ చేపట్టిన ఈ గుడ్ హెల్త్ రన్ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలి. ఆరోగ్యం పై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలి. ఇలాంటి అవగాహన కార్యక్రమాన్ని మణిపాల్ హాస్పిటల్ వారు నిర్వహించేందుకు ముందడుగు వేయడం శుభపరిణామం. ప్రజలందరూ ఇందులో భాగస్వాములు అయ్యి ఆరోగ్యాంధ్రప్రదేశ్ ను సాధించాలి.” అని అన్నారు.

మణిపాల్ గుడ్ హెల్త్ రన్ టీ-షర్ట్ ఆవిష్కరణ సందర్భంగా డాక్టర్ సుధాకర్ కంటిపూడి, డైరెక్టర్, మణిపాల్ హాస్పిటల్స్ మాట్లాడారు. “ ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో చాలా మంది ఆరోగ్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో వయసుతో నిమిత్తం లేకుండా అనేక మంది రోగాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ నెల 11 వ తేదీన బీఆర్టీఎస్ రోడ్డులో 5కె & 10కె రన్ నిర్వహిస్తున్నాము. ఆరోగ్యంగా ఉండటంతో పాటు శారీరక వ్యాయామం ఎంత ముఖ్యమో తెలియజేయడమే ఈ రన్ ముఖ్య ఉద్దేశ్యం. అంతేగాకుండా అత్యవసర సమయాల్లో చేయవలసిన చికిత్సలు & విధులతో పాటుగా అవయవ దానముపై అవగహన కల్పిస్తున్నాము. ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ఈ రన్ మరింత దోహదపడుతుంది. ఈ రన్ లో 16 ఏళ్లకు పైబడిన వారు ఎవరైనా సరే పాల్గొనవచ్చు. ముఖ్యంగా విజయావాడలోని కళాశాల విద్యార్థులు, రన్నర్స్, ఫిట్నెస్ సెంటర్స్, అమరావతి రన్నర్స్ తో పాటు అనేక వాకర్స్ క్లబ్ లు, ఇతరులు పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను.” అని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *